//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లోక సభ మాజీ స్పీకర్ ఆకస్మిక మృతి ...!

Category : politics national

లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ(89) మృతిచెందారు. కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు.

అయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నడు , ఛటర్జీ 40 రోజుల క్రితం మెదడులో నరాలు చిట్లిపోవడంతో పక్షవాతానికి గురై ఆసుపత్రిలో చేరారు. మూడ్రోజుల తరువాత పరిస్థితి మెరుగవడంతో డిశ్ఛార్జి అయ్యారు. మళ్లీ మంగళవారం ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఆయనకు స్వల్పంగా గుండెపోటు వచ్చింది.

దీంతో వైద్యులు ఆయనకు కృత్రిమ శ్వాసపై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1968లో సీపీఎం కార్యకర్తగా ప్రజాజీవితంలో మమేకమైన ఛటర్జీ అనతికాలంలోనే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. పదిసార్లు లోక్‌సభ ఎంపీగా సేవలందించారు. యూపీయే హయాంలో 2004 నుంచి 2009 వరకు లోక్ సభ స్పీకర్‌గా వ్యవహరించారు.

Related News