//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మావోల చేతిలో విదేశీ ఆయుధాలు

Category : national

మావోలు పంధా మార్చారా..? ఇక స్వదేశి ఆయుధాలు వద్దనుకున్నారా..? అందుకోసం భారీగానే ఖర్చు చేస్తున్నార..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వివరాల్లోకి వెళితే మావోయిస్టులు అత్యాధునిక విదేశీ ఆయుధాలు వినియోగిస్తున్నట్టు నిర్ధారణయింది. ఈనెల 3న ఛత్తీస్గఢ్‌ లోని సుకుమా జిల్లా పుట్టకోట ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య ఈనెల 3న ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.

పోలీసులు ఈ ప్రదేశంలో జర్మనీకి చెందిన అత్యాధునిక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి ఏకే47, ఎస్‌ఎల్‌ఆర్‌తో పాటు రాకెట్‌ లాంచర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వాటిలో జర్మనీకి చెంది న జీ3 రైఫిల్‌ కూడా ఉండటం పోలీసులను కలవరపెడుతుంది. దీనికి ఒకటి 20-30రౌండ్లు, మరొకటి 50రౌండ్లు సామర్థ్యం కలిగిన రెండు మ్యాగజైన్స్‌ ఉన్నాయి. దీనితో ఇప్పుడు దీని మీద విచారణ వేగవంతం చేసారు పోలీసులు. ఉగ్రవాదులతో మావోలు ఏమైనా సంబంధాలు కొనసాగిస్తున్నారా..?ఇలాంటి ఆయుధాలు వారి వద్ద ఇంకా ఉన్నాయా...? అసలు దీని కొస౦ వారేమైనా ఖర్చు చేస్తున్నారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు.