అమెరికాకు చెందిన కార్ల తయారీ సంస్థ ఫోర్డ్.. 39,315 యూనిట్ల ఫియస్టా క్లాసిక్, పాత ఫిగో కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2004 నుంచి 2012 మధ్యకాలంలో చెన్నై ప్లాంట్‌లో తయారైన ఈ రెండు రకాల కార్లలో స్టీరింగ్‌కు విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రీకాల్ చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. స్టీరింగ్ తిప్పే సమయంలో తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుందని కంపెనీ పరిశీలనలో తేలింది. దీంతో రీకాల్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ రెండు రకాల కార్లు కలిగివున్నవారు డీలర్లను సంప్రదించి మార్చుకోవాల్సి ఉంటుంది. 2013లో 1.66 లక్షల ఫిగో, ఫియస్టా క్లాసిక్ మోడళ్లను రీకాల్ చేసిన విషయం తెలిసిందే. గతేడాది కూడా 42 వేల హ్యాచ్‌బ్యాక్ ఫిగోను రీకాల్ చేసింది.