//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కుప్పకూలిన రైల్వేఫుట్‌ ఓవర్ బ్రిడ్జి

Category : national

ఆగి ఉన్న రైలుపై పాదచారుల వంతెనలోని కొంత భాగం కుప్పకూలిన ఘటన ముంబైలోని కర్రీ రోడ్ స్టేషన్‌లో బుధవారం చోటుచేసుకుంది.

అయితే అదృష్ట వశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. పాదచారుల బ్రిడ్జి నిర్మాణం జరుపుతుండగా కొంత భాగం కుప్పకూలి రైలుపై పడినట్టు అధికారులు తెలిపారు. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయినా తక్షణ ప్రాతిపదకపై అధికారులు చర్యలు తీసుకుని రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.

గత సెప్టెంబర్ 29న ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్ రోడ్ స్టేషన్‌లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం మరచిపోక ముందే తాజా ఘటన చోటుచేసుకుంది. నాటి దుర్ఘటనలో 23 మంది దుర్మరణం పాలయ్యారు. దాంతో బ్రిడ్జి నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్మీ సాయం తీసుకుంది. మరలా ఈ విధంగా జరగడంతో రైల్వే అధికారులు కాస్త ఆందోళనకి గురయ్యారు. అయితే ఏమీ లేదని తెలియడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.