వచ్చే మాసాల్లోవచ్చే మాసాల్లో అహారోత్పత్తుల ధరలు ద్రవ్యోల్బణ సూచీలకు మరింత ఆజ్యం పోయనున్నాయని తాజాగా మోర్గన్ స్టాన్లే ఒక రిపోర్టులో వెల్లడించింది. ఈ గ్లోబల్ ఫైనాన్సీయల్ సర్వీసెస్ సంస్థ నివేదిక ప్రకారం ఇప్పటికే జూన్, జులైలో ధరలు పెరిగాయి. భవిష్యత్ మాసాల్లో ఈ ధరలు మరింత పెరగనున్నాయి. ప్రస్తుత ఏడాది జులైలో టోకు ద్రవ్యోల్బణం సూచీ 1.88 శాతానికి ఎగిసింది. ఇంతక్రితం జూన్ మాసంలో ఇది 0.90 శాతంగా చోటు చేసుకుంది.
ప్రధానంగా అహారోత్పత్తులు, కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. క్రితం మాసంలో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 2.36 శాతానికి పెరిగింది. చక్కెర, కన్ఫెక్షణరీ ఉత్పత్తులు, పాన్, పొగాకు తదితర ఉత్పత్తుల ధరలు ఎగిశాయి.ప్రస్తుత ఆగస్టులో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ), టోకు ద్రవ్యోల్బణం సూచీ వరుసగా 3 శాతం, 2.1 శాతానికి పెరుగొచ్చని మోర్గాన్ స్టాన్లే తన పరిశోధన నివేదికలో పేర్కొంది.
ఆగస్టు తొలి వారంలో జరిగిన రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భవిష్యత్తులో కొంత ద్రవ్యోల్బణం సూచీ దిగిరావచ్చని, దీంతో వడ్డీ రేట్లు తగ్గడానికి మరింత అవకాశం ఉందని సెంట్రల్ బ్యాంకు అంచనా వేసింది. వరుసగా మళ్లీ ధరలు పెరిగితే ఇక వడ్డీ రేట్ల కోతకు అవకాశం ఉండకపోవచ్చని మోర్గాన్ స్టాన్లే పేర్కొంది. అక్టోబర్లో జరగనున్న ఆర్బిఐ పరపతి సమీక్షలో ఆగస్టు, సెప్టెంబర్ వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీలను కీలకంగా తీసుకోనుందని తెలిపింది.
దేశీయంగా రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం లేకపోలేదని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ఐ) 'ద్రవ్య పరపతి విధాన కమిటీ' సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం క్రమంగా పెరిగే అవకాశం లేకపోలేదని హెచ్చరికలు జారి చేసింది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున ఇక కొత్తగా వడ్డీరేట్లలో కోత విషయం అటుంచి, ఇప్పటికే తగ్గించిన వడ్డీ రేట్లు ప్రజలకు చేరేలా వాణిజ్య బ్యాంకులు తగిన చర్యలు చేపట్టేలని భావిస్తున్నారు.