//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అక్కడా మనమే నెం.1

Category : world

భారతీయ వంటకాలు అంటే చాలు ఎవరైనా లొట్టలు వేయాలిన్సిందే. మరీ ముఖ్యంగా విదేశీయులకు ఈ భారతీయ వంటకాలు అంటే చాలా ప్రీతి. ఇప్పటి వరుకు పప్పు, ఆవకాయ, బిర్యానీ తదితరాలకే ప్రియులు ఉంటారు అని అనుకున్నాము.

కానీ ఇపుడు సమోసా అంటే ఇష్ట పడని వారు ఎవరు ఉండరు అంట ఆ పేరు వింటేనే చాలా మందికి నోరూరిపోతుంటుంది. భారతీయులతో పాటు విదేశీయులు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. తాజాగా మన సమోసా విదేశీ గడ్డపై కూడా చిరుతిళ్ల పోటీల్లో విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాలో జరిగిన వంటకాల పోటీలో కశ్మీరీ చిల్లీ చికెన్‌ సమోసాకు తొలి స్థానం దక్కింది. దక్షిణాఫ్రికాలో వీక్లీ పోస్ట్‌ అనే మీడియా సంస్థ ఇటీవల చిరుతిళ్ల పోటీని నిర్వహించింది.

ఇందులో చాక్లెట్‌, జీడిపప్పు వంటకాలు, పిజ్జాలు, చికెన్ జల్పానే లాంటి వాటిని కూడా వెనక్కి నెట్టి కశ్మీరీ చిల్లీ చికెన్‌ సమోసా మొదటి స్థానంలో నిలిచింది. అసలు విషయానికి వస్తే సల్మా అగ్జే అనే మహిళ తయారుచేసి ఈ చిల్లీ చికెన్ సమోసాకు భోజన ప్రియులు పట్టంగట్టారు. ఈ పోటీలో తన వంటకం గెలవడం తనికి చాల ఆనందంగా ఉందని సల్మా తెలిపారు. తనకు వంటలు చేయడం చాలా ఇష్టమని.. వంటకాల్లో ఎప్పుడూ ప్రత్యేక రుచి ఉండేలా చూసుకుంటానని ఆమె అన్నారు.

అందుకే చికెన్ సమోసా ఆలోచన వచ్చిందని తెలియజేశారు. అలాగే వేగంగా సమోసాలు తయారుచేసే పోటీలోనూ 63ఏళ్ల రోక్సానా నసీమ్‌ అనే మహిళ విజేతగా నిలిచారు. ఒక్క నిమిషంలో ఆమె 10 సమోసాలను తయారుచేశారు. ఇక వేగంగా సమోసాలు తినే పోటీలో ఇబ్రహీం బక్స్‌ అనే వ్యక్తి గెలుపొందాడు. ఆయన ఒక్క నిమిషంలో 10 సమోసాలను తినేశాడు.