//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇన్ఫోసిస్‌లో వరుసగా నిష్క్రమణలు.. భారీగా నిధుల గోల్ మాల్

Category : business

దేశంలోనే అతి పెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో వరుసగా పలువురు ఎగ్జిక్యూటివ్‌లు నిష్క్రమిస్తూ ఉండటం, భారీ స్థాయిలో నిధుల దుర్వినియోగం జరుగుతూ ఉండడం పట్ల పెను దుమారం లేస్తుంది. కంపెనీ పనిచేస్తున్న తీరుతెన్నుల పట్ల స్వయంగా కంపెనీ వ్యవస్టాపకుడు ఎన్‌ ఆర్‌ నారాయణమూర్తికి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండడంతో పరిస్థితుల తీవ్రత వెల్లడవుతుంది. 

కంపెనీ లొసుగులను బైట పెట్టడం కోసం  గిబ్సన్‌, డన్‌ అండ్‌ క్రుట్చర్‌ నివేదిక బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల ఇన్ఫోసిస్‌ బోర్టుకు వ్రాసిన లేఖలో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ గా రితికా సూరి నిష్క్రమించిన వైనాన్ని  ప్రశ్నించారు. రితికా ఇజ్రేల్‌కు చెందిన పానాయాను టేకోవర్‌ చేసిన బృందంలో ఒకరు. కాగా గ్లోబల్‌ లా కంపెనీ క్లిన్‌ చిట్‌ ఇచ్చిన వెంటనే ఆమె కంపెనీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు.

ఆమె ఎస్‌ఏపీ (సాప్‌)లో ప్రస్తుతం ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ విశాల్‌ సిక్కా మాజీ సహోద్యోగి. సిక్కా ఇన్ఫోసిస్‌లోకి వచ్చిన వెంటనే ఆమె కూడా ఇన్ఫోసిస్‌లో చేరారు. కంపెనీలో కార్పొరేట్‌ డెవెలప్‌మెంట్‌ అండ్‌ వెంచర్స్‌ హెడ్‌గా పనిచేశారు. పానాయా డీల్‌ ఏప్రిల్‌ 2015లో కుదరినప్పుడు ఆమె ఈ డీల్‌పై సంతకాలు చేశారు. ఇక్కడి నుండి నుంచి ఈ ఏడాది జూన్‌లో నిష్క్రమించారు.

ఆమె నిష్క్రమణ తర్వాత ఇన్ఫోసిస్‌లో పలువురు టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టారు. వారిలో ప్రధానంగా  అమెరికా హెడ్‌ సందీప్‌ దల్దానీ, అన్రిబేన్‌ దే, చీఫ్‌్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ ఎడ్జ్‌ ప్రాడక్ట్స్‌, ఎడ్డ్‌ వెర్వ్‌, యూసుఫ్‌ బషీర్‌ , గ్లోబల్‌ హెడ్‌ ఇన్ఫోసిస్‌కు చెందిన 500 మిలియన్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ హెడ్‌గా పనిచేశారు.

ఇక కంపెనీలో సుపరిపాలనతో పాటు టాప్‌ ఎగ్జిక్యూటవ్‌లు ఇష్టం వచ్చినట్లు ఖర్చులు పెడుతుండటంతో మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో జూన్‌లో ఇన్ఫోసిస్‌ ఒక నివేదికను బహిర్గతం చేసింది. వాటిలో మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ బన్సల్‌ కంపెనీ నుంచి రాజీనామా చేసి వెళ్లిపోతే కోట్లాది రూపాయలు నజరానా ఇవ్వడంపై పెద్దెత్తున విమర్శలు వచ్చాయి.

అలాగే కంపెనీ ఎండీ, సీఈవో విశాల్‌ సిక్కా కూడా విపరీతమైన ఖర్చులు చేయడంపై కూడా కంపెనీ వ్యవస్థాపకులు ప్రశ్నల వర్షం కురిపించారు. సీబీఐతో పాటు   అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజీ కమిషన్‌ కూడా ఇజ్రెల్‌ కంపెనీ పానాయా టేకోవర్ సుమారు 200 మిలియన్‌ డాలర్లు భారత కరెన్సీ ప్రకారం రూ.1,280 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని తేల్చింది.

నారాయణమూర్తి పానాయా నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేస్తుంటే కంపెనీ మాత్రం నివేదికన బహిర్గతం చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. నిధుల దుర్వినియోగంపై జరిగిన విచారణలో సుమారు 50 మందిని భారత్‌తో పాటు అమెరికా, ఇతర దేశాల్లో విచారించింది. 

కంపెనీ మాజీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు మాట్లాడుతూ ఇటీవల కంపెనీ నుంచి నిష్క్రమించిన ఎగ్జిక్యూటివ్‌లు ప్రధానంగా ఇన్ఫోసిస్‌ టేకోవర్‌ చేసిన లావాదేవీలపై వచ్చిన ఆరోపణలు దానిపై వెలువడిన నివేదికను బహిర్గతం చేయడానికి వెనుకంజవేయడంతో మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు.