//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మళ్ళి హిట్ ట్రాక్ ఎక్కిన డైరెక్టర్స్

Category : movies

తేజ


ప్రస్తుత తెలుగు ఇండస్ట్రీలో లవ్ స్టోరీ తీయాలంటే డైరెక్టర్ తేజ తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. అటువంటి ఈ దర్శకుడికి కొన్ని సంవత్సాలు పాటు ప్లాప్ లు నీడలా వెంట పడ్డాయి. అటువంటి టైములో ట్రాక్ మార్చి దగ్గుపాటి రానాతో "నేనేరాజు నేనేమంత్రి" సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడు.

శేకేర్ కమ్ముల.

శేఖర్ కమ్ముల అంటే గుర్తుచ్చేవి ఆనంద్, హ్యాపీ డేస్ వంటి యూత్ సినిమాలు. ముఖ్యంగా శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఊపేసింది. అటువంటి డైరెక్టర్ కి కొన్ని సంవత్సాలు పాటు గడ్డు కాలమే ఎదురైంది. ఆతరువాత తన పంధా మార్చి మెగా హీరో వరుణ్ తేజ్ తో "ఫిదా" మూవీ చేసి తన సత్తా నిరూపించుకున్నాడు.

సుకుమార్


డిఫిరెంట్ లవ్ స్టోరీస్ తీయడంలో సుకుమార్ దిట్ట. అటువంటి క్రియేటివ్ డైరెక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు హోరోగా విభిన్న కదాంశంతో 1 -నేనొక్కడినే సినిమా తీసాడు. తన కాన్సెప్ట్ జనానికి ఎక్కక బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం పొందింది ఈ చిత్రం. తరువాత రూటుమార్చి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమా తీసి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాతో సుకుమార్ దశ తిరిగిపోయింది.

పరశురామ్


సోలో లాంటి ఫ్యామిలీ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్సు కి దగ్గరయ్యాడు పరుశురాం. కానీ ఆ సినిమా ఇచ్చిన క్రేజ్ ని ఎందుకో నిలబెట్టుకోలేకపోయాడు. సారొచ్చారు మూవీ తీసి తన కెరీర్ ని డైలమాలో పడేసుకున్నాడు. ఆ తరువాత గీత ఆర్ట్స్ లో గీతగోవిందం లాంటి మూవీ తీసి సాధారణ డైరెక్టర్ కాస్త స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.

బాబీ


కొంతమంది స్టార్ డైరెక్టర్స్ దగ్గర రైటర్ గా పనిచేసి ఆ అనుభవంతో రవితేజ లాంటి స్టార్ హీరోతో "పవర్" సిమిమా తీసి డీసెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. తరువాత పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తీసాడు. ఆ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో బాబీ కెరీర్ ఆల్మోస్ట్ తెరపడిందనుకునే లోపే ఎన్టీఆర్ తో జై లవ కుశ సినిమా తీసి ఓవర్ నైట్ లో తాను కూడా స్టార్ డైరెక్టర్ అని నిరూపించుకున్నాడు.

త్రివిక్రమ్


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సాధారణ రైటర్ గా ఇండస్ట్రీలోకి వచ్చి ఓ స్టార్ రైటర్ గా మారాడు. తరువాత మెగా ఫోన్ పట్టి అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ అదే కాంబినేషన్ లో అజ్ఞాతవాసి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాడు. ఆ తరువాత వరస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా దూసుకుపోతున్న ఎన్టీఆర్ తో అరవింద సమేత లాంటి ఒక విభిన్న కధాంశంతో ముందుకు వచ్చి తన పెన్నుకున్న పవర్ ఏంటో ఎన్టీఆర్ ద్వారా నిరూపించుకుని స్టార్ డైరెక్టర్స్ లో టాప్ త్రీ డైరెక్టర్ గా నిలిచాడు.