//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లెనోవో ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు ఇచ్చిన ఫ్లిప్‌కార్ట్‌

Category : business

ఫ్లిప్‌కార్ట్ సంస్థ తన సైట్‌లో యూజర్లు కొనుగోలు చేసే లెనోవో ఫోన్లపై భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నది. అందుకు గాను లెనోవో మొబైల్ ఫెస్ట్ పేరిట ఓ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ ఇవాళ ప్రారంభించింది. ఈ నెల 28వ తేదీ బుధవారం వరకు ఈ సేల్ కొనసాగనుండగా, ఇందులో పలు లెనోవో ఫోన్లపై రాయితీలు లభిస్తున్నాయి.

* లెనోవో కె6 పవర్ ఫోన్ ధర రూ.1వేయి వరకు తగ్గింది. దీంతో ఈ ఫోన్‌కు చెందిన 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లను వరుసగా యూజర్లు రూ.8,999, రూ.9,999 ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఇక దీనిపై యూజర్లకు రూ.8,500 వరకు పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తున్నది.

* లెనోవో వైబ్ కె5 నోట్ ఫోన్ 4జీ మోడల్ రూ.12,499 ధర ఉండగా ఇప్పుడా ఫోన్‌ను రూ.10,499కే కొనుగోలు చేయవచ్చు. ఇదే ఫోన్ 3జీబీ మోడల్ ధర రూ.11,999 ఉండగా ఇప్పుడీ ఫోన్ రూ.9,999 ధరకే లభిస్తున్నది. దీంతోపాటు రూ.9వేల వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.

* లెనోవో వైబ్ కె5 ప్లస్ రూ.8,499 ధర ఉండగా, ఇప్పుడీ ఫోన్ రూ.7,499 ధరకే లభిస్తున్నది. దీనిపై రూ.7వేల వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.

* లెనోవో పీ2 స్మార్ట్‌ఫోన్ 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో అందుబాటులో ఉండగా, ఇవి వరుసగా రూ.12,999, రూ.14,999 ధరలకు లభిస్తున్నాయి. ఇవి రూ.4వేలు, రూ.3వేల వరకు తగ్గింపు ధరలకు లభ్యమవుతున్నాయి. మరో రూ.14వేల వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నారు.