ఫ్లిప్కార్ట్ సైట్లో ఫ్లాగ్షిప్ ఫోన్స్ సేల్ షురూ అయింది. ఈ సేల్లో ఐఫోన్ 7 సహా గూగుల్ పిక్సల్, మోటో జడ్ వంటి స్మార్ట్ఫోన్లపై యూజర్లకు రాయితీలు లభిస్తున్నాయి. ఐఫోన్ 7 ప్లస్ (128జీబీ)పై ఏకంగా రూ.22వేల తగ్గింపు లభిస్తున్నది. దీనికి తోడు మరో రూ.15వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ను అందిస్తున్నారు. ఇలాగే దాదాపుగా అన్ని ఫోన్లపై డిస్కౌంట్లను అందిస్తున్నారు. వాటితోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ సేల్ ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది.
ఐఫోన్ 7 (128 జీబీ) ధర రూ.51,499 (రూ.18,501 తగ్గింది)
ఐఫోన్ 7 (32 జీబీ) ధర రూ.42,499 (రూ.17,501 తగ్గింది)
గూగుల్ పిక్సల్ (32 జీబీ) ధర రూ.44వేలు (రూ.13వేలు తగ్గింది)
ఐఫోన్ 6ఎస్ (32 జీబీ) ధర రూ.32,999 (రూ.15వేలు తగ్గింది)
శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రొ ధర రూ.31,900 (రూ.5వేలు తగ్గింది)
మోటో జడ్ ధర రూ. 29,999 (రూ.10వేలు తగ్గింది)
ఐఫోన్ 6 ధర రూ.22,999 (రూ.13,991 తగ్గింది)
ఐఫోన్ ఎస్ఈ (32 జీబీ) ధర రూ.21,999 (రూ.5,201 తగ్గింది)
ఐఫోన్ 5ఎస్ ధర రూ.14,999 (రూ.5,001 తగ్గింది)
లెనోవో జడ్2 ప్లస్ (32 జీబీ) - రూ.9,999 (రూ.5వేలు తగ్గింది)