ఆన్లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థలయిన ఫ్లిప్‌కార్ట్, షాప్క్లూస్లు భారీ ఆఫర్స్ ప్రకటించాయి. ఫ్లిప్‌కార్ట్ 9 రోజులపాటు ఫ్యాషన్ ఉత్పత్తులపై ఆఫర్లు ప్రకటించగా షాప్‌క్లూస్ వారం పాటు హోం కిచెన్, ఎలక్ట్రానిక్, ఫ్యాషన్ వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. జూన్ 10 నుంచి 18 వరకు ఫ్లిప్‌కార్ట్ ‘ఫ్యాషన్ డేస్’ కొనసాగుతాయని, ఇందులో 50 రకాల బ్రాండ్లు అమ్మకానికి ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ హెడ్ రిషీ వాసుదేవ్ తెలిపారు. ఇందులో భాగంగా ‘బిడ్ ఎన్ విన్’ అనే కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రూ.13,995 విలువైన ఎంపోరియో అర్మానీ వాచీ, రూ.15,960 విలువైన విక్ట్రానిక్స్ బ్యాగ్ వంటివి గెలుచుకునే అవకాశం ఉందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.