ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ .. యాపిల్ ఉత్పత్తులపై భారీ స్థాయిలో డిస్కౌంట్స్‌ను ప్రకటించింది. యాపిల్ డేస్ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ 24 నుంచి 26వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. యాపిల్ ఐఫోన్6 ధరపై దాదాపు రూ.26,000 తగ్గించగా ఐఫోన్7పై దాదాపు రూ.20,000 తగ్గింపు ఇవ్వనుంది. ఐఫోన్ ఎస్ఈ మోడల్‌పై రూ.6000, 5ఎస్ మోడల్‌పై రూ.2501 తగ్గించింది. కేవలం ఫోన్లపై మాత్రమే కాకుండా యాపిల్‌కు సంబంధించిన ఇతర ఉత్పత్తులపైనా ఆఫర్లను ప్రకటించింది.