భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, ఈబే ఇండియాను స్వంతం చేసుకుంది. ఈ కంపెనీలో మైక్రోసాఫ్ట్, ఈబే, టెన్ సెంట్ కంపెనీలు దాదాపు 1.4 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ డీల్ లో ముఖ్యంగా ఈబే కంపెనీ క్యాష్ మరియు ఈక్విటీ రూపంలో ఈబే ఇండియాను ఫ్లిప్ కార్ట్ కు అమ్మింది. దీనికి ప్రతిఫలంగా ఈబే ఫ్లిప్ కార్ట్ లో షేర్లు తీసుకుంది. అయితే ఈబే ఇండియా ఫ్లిప్ కార్ట్ ఆధీనంలో ఉన్నా, స్వయంగా కార్యకలాపాలను నిర్వహించనున్నదని కంపెనీ వర్గాలు తెలిపాయి. అటు ఫ్లిప్ కార్ట్ వినియోగదారులు అంతర్జాతీయ ఈబే ఉత్పత్తులను, ఇటు ఈబే వినియోగదారులు ఫ్లిప్ కార్ట్ దేశీయ ఉత్పత్తులను కొనుగోలుచేసేందుకు వెసులుబాటు కలుగుతుంది.