ఇజ్రాయిల్ పై అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాలు వ్యతిరేక ధోరణితో ఉన్న విషయము తెలిసిందే. చివరకు, తమ గగనతలం నుంచి కూడా ఇజ్రాయెల్ కు విమానాల రాకపోకలను ఆయా దేశాలు అంగీకరించవు. కానీ, తమ దేశ గగనతలం మీదుగా మన దేశ విమానాలు ఇజ్రాయెల్ కు వెళ్లేందుకు సౌదీ అరేబియా అంగీకరించింది. ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలకు ఈ అనుమతి లభించింది.
ఈ విషయాన్ని ఇజ్రాయెల్ కు చెందిన ఓ పత్రిక వెల్లడించింది. అయితే, భారత విమానయాన శాఖ, ఎయిర్ ఇండియా అధికారులు గానీ ఇంకా ధ్రువీకరించలేదు. మార్చి నుంచి ఢిల్లీ-టెల్ అవీవ్ ల మధ్య వారానికి మూడుసార్లు విమానం నడిపేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ను ఎయిర్ ఇండియా అనుమతి కోరామని, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో, టెల్ అవీవ్ లోని బెన్ గురియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తమ విమాన సర్వీసులకు స్లాట్ల కోసం ఎదురు చూస్తున్నామని సంబంధిత అధికారి సమాచారం.
కాగా, ప్రస్తుతం టెల్ అవీవ్ నుంచి ముంబై వచ్చే విమానాలు ఎర్రసముద్ర, గల్ఫ్ ఆఫ్ అడెన్ మీదుగా చాలా దూరం ప్రయాణించి భారత్ కు రావాల్సి వస్తోంది.సౌదే అరేబియా తమ గగనతలాన్ని ఉపయోగించుకునే అమనుతి ఇవ్వడంతోటెల్ అవీవ్ వెళ్లే ప్రయాణ సమయం దాదాపు రెండున్నర గంటలు తగ్గుతుంది.