కొన్ని కొన్ని సార్లు కొన్ని ఘటనలు వింటే నవ్వు రాక మానదు.
ఇప్పుడు చెప్పుకునేది భారత్ లో ఉత్తరాన ఉన్న గురుగ్రామ్ పరిధిలోని ఫజిల్ బద్ లీ అనే గ్రామంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి, పూర్తి వివరాల లోకి వెళితే రజ్బీర్ అనే వ్యక్తి నిన్న ఉదయం తన గోధుమ పొలంలోకి వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో ఓ పెద్ద బండరాయిలాంటిది అతని పొలంలో పడింది. ఆ సమయంలో పెద్ద శబ్దం కూడా వచ్చింది.
అయితే అదేంటో చూద్దూమని చుట్టుపక్కల ఉన్నవారు కూడా అక్కడకు వచ్చారు. ఆ వస్తువు తెల్లటి రంగులో చల్లగా ఉంది. కిందకు పడటంతో అది ముక్కలుగా విడిపోయింది. అది బహుశా ఉల్కా శకలం అయి ఉండవచ్చని వారిలోని కొందరు భావించారు. విలువైన నిధి సంపద కూడా అయి ఉండవచ్చని మరికొందరు భావించారు. దీతో, ముక్కలకు కొందరు ఇంటికి తీసుకెళ్లి, ఫ్రిజ్ లో పెట్టుకున్నారు.
ఆ తర్వాత ఈ విషయం కాస్తా అధికారుల దాకా వెళ్ళింది. దీంతో వాతావరణ శాఖ అధికారులు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు గ్రామానికి చేరుకుని, ఆ పదార్థాన్ని పరీక్ష చేసి, అసలైన విషయాన్ని వెల్లడించారు. దీంతో, వాటిని ఫ్రిజ్ లో పెట్టుకున్నవారంతా అవాక్కయ్యారు. యాక్ అంటూ వాంతులు చేసుకున్నారు.
వాస్తవానికి దాన్ని బ్లూ ఐస్ అంటారు. అంటే విమానాల్లో మలమూత్రాలను ఘన రూపంలో భద్రపరుస్తారు. అప్పుడప్పుడు అవి విమానాల నుంచి లీకై కిందకు పడుతుంటాయి. కొన్నిసార్లు వాటిని నిర్దేశిత ప్రాంతాల్లో కూడా జారవిడుస్తుంటారు. విషయం తెలిసిన తర్వాత ఫ్రిజ్ లలో ఉన్న ఆ మలమూత్ర వ్యర్థాలను బయటకి విసిరి కొట్టారు అక్కడి ప్రజలు.