//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సామ్‌సంగ్‌ వైస్‌ ఛైర్మన్‌ కు ఐదేళ్ల జైలు శిక్ష

Category : business

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సామ్‌సంగ్‌ వైస్‌ ఛైర్మన్‌ లీ జే యుంగ్‌ దోషిగా తేలారు.  లీ కేసు తుది విచారణ చేపట్టిన దక్షిణకొరియా న్యాయస్థానం ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

దక్షిణకొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్‌ గ్వెన్‌ హైకు సంబంధించిన కంపెనీలకు ఆయన దాదాపు 36 మిలియన్‌ డాలర్లు మళ్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందుకు ఆయన భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారని అభియోగాలు నమోదయ్యాయి.

అత్యంత ధనవంతుడిగా పేరొందిన లీపై అవినీతి, లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనను ఫిబ్రవరిలో అక్కడి అధికారులు అరెస్టు చేశారు. లీకు 12ఏళ్ల జైలు శిక్ష విధించాల్సిందిగా ప్రాసిక్యూటర్‌ న్యాయస్థానాన్ని కోరారు.

కానీ కేసు వివరాలను పరిశీలించిన న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ తయారీదారుల సంస్థగా సామ్‌సంగ్‌ నిలిచిన విషయం తెలిసిందే.