//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నోకియా నుంచి 5స్మార్ట్‌ఫోన్లు..!

Category : business

స్మార్ట్‌ఫోన్‌ వ్యాపారాల్లోకి నోకియా గతేడాది జనవరి 1కి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలి సిందే. 2017లో మార్కెట్లోకి పునఃప్రవేశమైన తర్వాతనోకియా బ్రాండులో బడ్జెట్‌, ప్రీమియం సెగ్మెంట్ల లో పలు స్మార్ట్‌ఫోన్లు వినియోగదారుల ముందుకు వచ్చాయి.

2018లో కూడా 2017 వ్యూహాన్నే పాటించనున్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రకటించింది. ప్రస్తుతం హెచ్‌ఎండీ గ్లోబల్‌ హైఎండ్‌ ఫోన్‌ నోకియా 9పై పనిచేస్తుందని, నోకియా 6, ఆండ్రాయిడ్‌ గో ఆధారిత నోకియా 1ను లాంచ్‌చేసేందుకు సిద్ధమవుతుందన్న సంగతి తెలి సిందే. తాజాగా నోకియా 4, మరో హైఎండ్‌ ఎడిషన్‌ నోకియా 7ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లను కూడా లాంచ్‌ చేయబోతుందని తెలుస్తోంది.

నోకియా కెమెరా యాప్‌ ఈరెండు స్మార్ట్‌ఫోన్లను ధృవీకరించిన ట్లు గిమొయైనా రిపోర్టు పేర్కొంది. నోకియా అతిపెద్ద వెర్షన్‌లో, స్నాప్‌డ్రాగన్‌ 660తో రూపొందుతుందని ఈ కెమెరా యాప్‌ పేర్కొంది. నోకియా 4 గురించి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు తెలియరాలేదు. ఈఏడాది లాంచ్‌చేసేందుకు ఐదు కొత్త స్మార్ట్‌ఫోన్‌లపై హెచ్‌ఎండీ నోకియా 1ఫోన్లతో నోకియా 9ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రకటిస్తుందని తెలిసింది. నోకియా 4, నోకియా 7ప్లస్‌ ఈఏడాది ద్వితీయార్థంలో ప్రవేశపెట్టొచ్చని తెలుస్తోంది.

హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌గా రాబో తున్న నోకియా 9, 5.5అంగుళాల ఓలెడ్‌ ప్యానల్‌, బెజెల్‌ లెస్‌ డిస్‌ప్లే, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835, 3,250 ఎంఎహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ఛార్జింగ్‌ టెక్నాలజీ, వెనుకవైపు డ్యూయల్‌కెమెరాను కలిగి ఉండబోతుంది.