ట్రిపుల్ తలాక్ పై సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్ట్ రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు మతాలకు చెందినవారు కావడం గమనార్హం. ఈ తీర్పు ఇవ్వడంలో ఏదో ఒక మత విస్వాసం బలమైన ముద్ర వేయరాదని ఉద్దేశ్యంతో ప్రధాన న్యాయమూర్తి జె యస్ ఖేహర్ ఇటువంటి ఏర్పాటు చేసిన్నట్లు కనబడుతున్నది.
మనదేశంలోని ప్రధాన మైన హిందూ, క్రైస్తవ, ఇస్లాం, సిక్కు, జొరాస్ట్రియానిజమ్ (పార్శీ) మతాలకు వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జస్టిస్ ఖేహర్ సిఖ్ మతస్థుడు. ఈ మతం నుండి ప్రధాన న్యాయమూర్తి పదవి అధిష్టించిన తొలి వ్యక్తి కావడం గమనార్హం. జస్టిస్ అబ్దుల్ నజీర్ ముస్లిం. జస్టిస్ కురియన్ జోసెఫ్ క్రిస్టియన్ కాగా జస్టిస్ రోహింగ్టన్ నారిమన్ పార్శి. జస్టిస్ యు యు లలిత్ హిందూ.
అతి సున్నితమైన ఈ అంశాన్ని రాజ్యాంగ పరిభాషలో పరిశీలించే విషయంలో అత్యున్నత న్యాయస్థానం చాల సున్నితంగా వ్యవహరించినట్లు స్పష్టం అవుతుంది.