//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నాలుగోసారి......ఐదుగురు జవాన్ల వీరమరణం...!

Category : national

జమ్ము శివారు ప్రాంతం సంజువాన్‌లోని సైనిక శిబిరంపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఉగ్రదాడి అనంతరం భద్రతా దళాలు చేపట్టిన ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోంది. జైషే ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో శనివారం ఇద్దరు జవాన్లు వీరమరణ పొందగా, మరో ముగ్గురు జవాన్లు మంగళవారం వీరమరణం పొందటంతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. వీరితో పాటు మరో పౌరుడు కూడా మృతిచెందాడు.

బలగాలు జరిపిన కాల్పుల్లో శనివారం ముగ్గురు తీవ్రవాదులు హతం కాగా, ఆదివారం మరో ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టింది. ఇంకా ఎదురెదురు కాల్పులు జరుగుతున్నాయా అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వనప్పటికీ బలగాలు మాత్రం ఆ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతున్నాయి.

ఇప్పుడో, మరికాసేపట్లోనో ఆపరేషన్ పూర్తి కావచ్చని జమ్మూ ఐజీపీ ఎస్డీ సింగ్ జామ్వాల్ తెలిపారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ బిపిన్ సింగ్ రావత్ ఆదివారం ఉదయం శ్రీనగర్‌ చేరుకున్నారు. సీనియర్ కమాండర్లతో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు