//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రైలు పట్టాలపై ఐదు మృతదేహాలు!

Category : national

ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు రైల్వేట్రాక్‌పై పడివున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. సంబల్‌పూర్‌ పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన పోలీసులు రైల్వేట్రాక్‌ వద్దకు చేరుకొని విచారణ జరిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగరు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. పట్టాలపై చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలను ఓ పాఠశాలలో సంగీత ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ధరణిధర్‌ పాండా, ఆయన భార్య సంగీత పాండాతో పాటు 13 నుంచి 20 ఏళ్ల లోపు వయస్సున్న ముగ్గురు కుమార్తెలవిగా గుర్తించారు.

ఈ ఘటనపై రైల్వే పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రాథమిక దర్యాప్తులో వీరంతా సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు తేలిందన్నారు. ఐదు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ ఘటన వెనుక అసలు కారణం ఏమిటో తెలియడంలేదన్నారు.ధరణిధర్‌ పాండా స్థానిక పాఠశాలలో సంగీత ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఆయన మృతికి సంతాపసూచకంగా పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఆయన ఎంతో మంచివారని, నిజాయతీ పరుడని తోటి ఉపాధ్యాయులు గుర్తుచేసుకున్నారు. మంగళవారం ఆయన పాఠశాలకు వచ్చారని, మధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోయారన్నారు.

పాఠశాలకు వచ్చినప్పుడు ఆయన ముఖంలో ఎలాంటి వత్తిడి, ఆందోళన తమకు కన్పించలేదని తోటి ఉపాధ్యాయుడు ఒకరు తెలిపారు. ఈ ఘటనపై సంబల్‌పూర్‌ ఎమ్మెల్యే రాజేశ్వరి పాణిగ్రహి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆ కుటుంబం ఆత్మహత్యకు కారణాలేమిటో తెలుసుకొనేందుకు దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.