Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాయల్స్ కు తొలి విజయం...!

Category : sports

ఐపీల్ లో వరుసగా గంభీర్ సేన రెండో పరాజయాన్ని చవిచూసింది. నిన్న రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో డక్ వర్త్ పద్దతి లో 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రెండేళ్ల సుదీర్ఘ విరామం తరువాత సొంత మైదానం జైపూర్ లో ఆడిన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.

మొదట టాస్ ఓడి బాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ జట్టు మంచి ఆరంభాన్ని అందుకుంది. కెప్టెన్ రహానే 45 పరుగులు తో రాణించాడు. అలాగే సంజు సాంసన్ 37 ,జోస్ బట్లర్ 29 0 పరుగులతో రాణించారు. మ్యాచ్ 17.5 ఓవర్లలో జరుగుతున్నప్పుడు వర్షం పడడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. అప్పటికి రాజస్థాన్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

తరువాత మ్యాచ్ ను 6 ఓవర్లకు కుదించారు. ఢిల్లీ లక్షాన్ని 71 పరుగులకు నిర్ణయించారు. 71 పరుగుల లక్ష్యం తో బాటింగ్ కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ ఓపెనర్ మున్రో మొదటి బంతికే రన్ అవుట్ అయ్యాడు. తరువాత మ్యాక్స్‌ వెల్‌ (17), రిషభ్‌ పంత్‌ (20), క్రిస్ మోరిస్ (17), విజయ్ శంకర్ (3) లి వరుసగా విఫలమయ్యారు. దీనితో ఢిల్లీ జట్టు 11 పరుగుల దూరం లో నిలిచి, ఓటమిని ఎదుర్కొన్నది.

Related News