//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మొట్టమొదటి మానవరహిత యుద్ధట్యాంకు మంత్ర

Category : national

మన దేశంలో మొట్టమొదటి మానవరహిత యుద్ధట్యాంకు మంత్రను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) రూపొందించింది. రిమోట్‌తో పనిచేసే ఈ ట్యాంకులు మూడురకాల సేవలు అందించనున్నాయి. నిఘా, ఖనిజాల గుర్తింపు, అణు, జీవ ఆయుధాలను పసికట్టేందుకు వీటిని రూపొందించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నివాళిగా డీఆర్డీవో ఆధ్వర్యంలో తమిళనాడులోని ఆవడికి చెందిన యుద్ధవాహనాల పరిశోధన, తయారీ సంస్థ (సీవీఆర్డీఈ) ప్రాంగణంలో ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

ఇందులో సంస్థ రూపొందించిన పలు నమూనాలను ప్రదర్శించారు. యుద్ధట్యాంకులను తలపించే రెండు రిమోట్ ఆధారిత ట్యాంకులను ప్రదర్శించారు. ప్రాథమికంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నీటిని ఉపయోగించడానికి ఆర్మీ అధికారులు ఆసక్తి కనబరిచారు. అలాగే కొన్ని మార్పులను సూచించారు. మంత్ర-ఎస్ భారతదేశంలో ప్రప్రథమంగా అభివృద్ధిచేసిన మానవరహిత ట్యాంకు. ఇది నిఘా అవసరాలకు ఉపయోగపడుతుంది. మంత్ర-ఎమ్‌ను ఖనిజాలను గుర్తించేందుకు, మంత్ర-ఎన్‌ను అణు, జీవ ఆయుధాలను గుర్తించేందుకు ఉపయోగిస్తారు. రాజస్థాన్‌లోని ఏడారి ప్రాంతమైన మహాజన్‌లో 52డిగ్రీల ఉష్ణోగ్రతవద్ద వీటిని పరీక్షించారు.

నిఘా ట్యాంకుపై రాడార్‌తో పాటు రహస్య కెమెరా ఉంటుంది. ప్రదర్శనలో పలు భారీ వాహనాలను ప్రదర్శించారు. ఇవి కమాండ్ కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలతో నడుస్తాయి. వీటిలో రాత్రి సమయంలోనూ లక్ష్యాలు కనిపించే ఏర్పాట్లతో పాటు లేజర్ ఆయుధాలు, విద్యుదయస్కాంత రక్షణ వ్యవస్థ ఉంటాయి. ప్రదర్శనలో వందల సంఖ్యలో కొత్త ఉత్పత్తులను డీఆర్డీవో ప్రదర్శించింది.

పెద్ద వాహనాలే కాకుండా చిన్న ఆవిష్కరణలకు కూడా చోటు దక్కింది. విద్యుదయస్కాంత ఆయుధాల దాడి నుంచి రక్షణ కల్పించే నానో ఎలక్ట్రోమ్యాగ్నటిక్ షీల్డులు, మొబైల్ ఫోన్‌లలో ఎన్‌క్రిప్టెడ్ సమాచారాన్ని జీఎస్సెమ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా వినే పరికరాలను, భవనం గోడకు తగిలిస్తే అందులోని వ్యక్తులందరినీ తెరపైన చూడగలిగే వాల్ పెనట్రేషన్ రాడార్‌ను ప్రదర్శించారు.