//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్టార్ హీరో కూతురి మొదటి ఫోటో షూట్......!

Category : movies

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ లోని స్టార్ హీరోలు తమ వారసులను మాత్రమే సినీరంగం లోకి తెచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పద్దతిని మార్చేశారు మారుతున్న కాలంలో ఆ హీరోల ఆలోచనలను కూడా మారిపోయాయి.

ఇప్పటికే స్టార్ హీరోల కూతురి హొధాలొ చాల మంది ఇండస్ట్రీకి వచ్చారు. ఆలా వచ్చిన వారు చాల వరకు విజయాలను అందుకున్నారు. ఇప్పటివరకు తండ్రి చాటు బిడ్డలా పెరిగిన సుహానా కూడా త్వరలో సినీ రంగం లోకి అడుగుపెట్టబోతోంది. దానికి ప్రాణం పోస్తూ ఇప్పుడు సుహానా తన తొలి ఫోటో షూట్ కు సిద్ధమైంది.సినీ పరిశ్రమకు అవసరమైన ఫ్యాషన్ ను అందమైన ఎక్స్ పోజింగ్ ను కూడా ఇప్పటికే ఒంటపట్టించేసుకుని సుహానా ఎంట్రీ కి సిద్ధంగా ఉన్నది.

సుహానా తన చిన్ననాటి నుండే తండ్రి సినిమాలను చూస్తూ పెరిగింది. ఇంట్లో ఎప్పుడు సినిమా వాతావరణం ఉంటుంది కాబట్టి ఆమె కూడా సినిమాలలో చేయాలనే కోరిక వున్నది. అలాగే షారుక్ భార్య అయిన గౌరీ కూడా తన కూతురిని హీరోయిన్ గా చూడాలని ఎప్పటినుంచో అనుకుంటుంది అని సమాచారం.

ఇందులో భాగం గా సుహానాసినీ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడానికి తొలి అడుగు వేసింది. ఓ ప్రముఖ బాలీవుడ్ మ్యాగజైన్ కు కవర్ పేజీ కోసం సుహానా ఫోజులిచ్చింది. ఇది ఆమె తొలి సోలో ఫోటో షూట్. సుహానా ఎప్పుడూ తన తల్లితో లేదా తండ్రితో మాత్రమే కనిపించేది. తల్లి గౌరి తన కూతురి మొదటి కవర్ పేజీ ముఖచిత్రం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఆ కవర్ పేజీ ఫోటో సుహానాకు సినిమా అవకాశాలు కచ్చితంగా తెచ్చిపెడుతుందని ఆమె నమ్మకం.

ఈ ఏడాది బాలీవుడ్ లో స్టార్ నటుల వారసులు చాల మంది పరిచయం కాబోతున్నారు. వీరిలో ప్రముఖంగా శ్రీదేవి కూతురు జాన్వీ, షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్, సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ సినిమా కెరీర్ ప్రారంభించారు. వారి బాటలోనే సుహానా పేరు కూడా త్వరలో జత చేరబోతోంది. ఆమె పక్కన నటించే అవకాశం కొట్టేసే హీరో ఎవరో తెలుసుకోవాలి అంటే కొన్ని రోజులు వేచిచూడాలి మరి.