//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రిటన్‌లో పండంటి పాపకు జన్మనిచ్చిన తొలి పురుషుడు

Category : editorial

బ్రిటన్‌లో గర్భందాల్చిన తొలి పురుషుడు 21ఏళ్ల హేడెన్‌ క్రాస్‌ పండంటి పాపకు జన్మనిచ్చారు. ‘అన్ని విధాలా పాప ఆరోగ్యంగా ఉంది. నేను చాలా అదృష్టవంతుణ్ని’అంటూ ఆయన మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. 

గ్లౌస్టర్‌షైర్‌లోని రాయల్ దవాఖానలో జూన్ 16న శస్త్రచికిత్స ద్వారా బాలికకు జన్మనిచ్చిన క్రాస్ 21 ఏళ్ల కిందట తనకున్న పేరు పైజ్‌ను పుట్టిన బిడ్డకు పెట్టాడు. హార్మోన్ చికిత్స ద్వారా మహిళ నుంచి పురుషుడిగా లింగమార్పిడి చేయించుకుని, మూడేండ్ల నుంచి చట్టబద్ధంగా అబ్బాయిగా గుర్తింపు పొందాడు. 

పూర్తిస్థాయిలో లింగమార్పిడి కోసం, అండ ఉత్పత్తిని స్తంభింపజేసేందుకు రూ.3.33లక్షల (4వేల పౌండ్లు) ఫీజు అవుతుందని బ్రిటన్ జాతీయ ఆరోగ్య సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) తేల్చిచెప్పింది. దీంతో ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఆటంకాలు ఎదురయ్యాయి. 

ఈలోపు ఫేస్‌బుక్ ద్వారా చేసిన విజ్ఞప్తికి గతంలో సూపర్‌మార్కెట్లో పనిచేసిన ఓ వ్యక్తి స్పందించాడు. డబ్బు తీసుకోకుండానే వీర్యం దానం చేసేందుకు ముందుకొచ్చాడు. గత సెప్టెంబరులో నేను గర్భం దాల్చా. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో అతను అందుబాటులో లేడు అని క్రాస్ పేర్కొన్నారు

బిడ్డ పుట్టడంతో మళ్లీ సాధ్యమైనంత త్వరగా పూర్తిస్థాయిలో పురుషుడిగా మారేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నట్టు చెప్పాడు. "అసలు నేను పురుషుడిగా మారడం అసాధ్యమేమో అనుకున్నాం. కానీ అది సాధ్యమయింది. ఇలా ఓ బిడ్డకు జన్మనిస్తానని ఊహించలేదు. ఇప్పుడు పూర్తిస్థాయిలో అబ్బాయిగా మారిపోతా" అని పేర్కొన్నాడు.

అమెరికాకు చెందిన థామస్ బియేటీ 2008లో మొదటిసారి ఓ బిడ్డకు జన్మనిచ్చిన పురుషుడిగా రికార్డులకెక్కాడు. ఎన్‌హెచ్‌ఎస్ ఒక్కో లింగమార్పిడి చికిత్స కోసం సాధారణంగా 29 వేల పౌండ్లు తీసుకుంటుంది.

Related News