//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐసీసీ లో తొలి మహిళా డైరెక్టర్.......!

Category : world

ప్రముఖ వ్యాపార వేత్త పెప్సికో ఛైర్మన్, సీఈఓ ఇంద్రా నూయీని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) డైరెక్టర్‌గా నియమించారు. ఈ కౌన్సిల్‌లో తొలి స్వతంత్ర మహిళా డైరెక్టర్‌ నూయీనే కావడం విశేషం. నూయీ అంతర్జాతీయ క్రికెట్‌ బోర్డులో 2018 జూన్‌లో చేరనున్నారని ఐసీసీ ఈరోజు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఐసీసీలో తనను డైరెక్టర్‌గా నియమించడం పట్ల చాలా సంతోషంగా ఉందని..

ఐసీసీ బోర్డు సభ్యులతో, భాగస్వాములతో, ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లతో కలిసి పనిచేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. క్రికెట్‌ బాధ్యతను మరింత పెంచడానికి, అభిమానులను ప్రతి బంతి, ప్రతి షాట్‌ ఫాలో అయ్యేలా చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు నూయీ తెలిపారు. ఐసీసీలో మరో స్వతంత్ర డైరెక్టర్‌ను నియమించడం.. అది కూడా మహిళను నియమించడం ఐసీసీలో కీలకమైన ముందడుగు అని ఐసీసీ ఛైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ తెలిపారు. ఇంద్రా నూయీ లాంటి సమర్థురాలైన వ్యక్తి డైరెక్టర్‌ కావడం అంతర్జాతీయ క్రికెట్‌కు గొప్ప శుభవార్త అని అన్నారు.

Related News