చైనా తన వ్యాపార సంబంధాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగానే బ్రిటన్ నుండి చైనా కు మధ్య అతిపెద్ద రైలు మార్గాన్ని నిర్మించుకున్నారు.ఇది ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గాల్లో రెండోది. బ్రిటన్ నుంచి చైనాకు బయలుదేరిన తొలి గూడ్స్ రైలు 12వేల కిలోమీటర్లు ప్రయాణించి శనివారం చైనాలోని యివు నగరానికి చేరుకుంది. లండన్ నుంచి ఏప్రిల్ 10న బయలుదేరిన ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, బెలారస్, రష్యా, కజకిస్థాన్ ల గుండా 20 రోజుల పాటు ప్రయాణించి చైనా చేరుకుంది. రైలులో వైన్, పాలు, ఔషధాలు, యంత్రాలు రవాణా అయ్యాయి. ఈ మార్గం పశ్చిమ యూరప్‌తో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చైనాకు ఎంతగానో ఉపయోగపడనుంది.