//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ లో భాగంగా తొలి రోజు వేలంలో పలువురు ఆటగాళ్ల ధరలకు రెక్కలొస్తే, మరికొందరు స్టార్ క్రికెటర్లకు మాత్రం తీవ్ర నిరాశే ఎదురైంది.

Category : sports

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ లో భాగంగా తొలి రోజు వేలంలో పలువురు ఆటగాళ్ల ధరలకు రెక్కలొస్తే, మరికొందరు స్టార్ క్రికెటర్లకు మాత్రం తీవ్ర నిరాశే ఎదురైంది.

ఈ రోజు బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో బెన్ స్టోక్స్(రూ.12.50 కోట్లు) అత్యధిక మొత్తంలో అమ్ముడు పోగా, మనీష్ పాండే(రూ.11.00 కోట్లు) కూడా రికార్డు ధర దక్కించుకున్నాడు. కాగా, మొదటి రోజు వేలంలో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ కు చుక్కెదురైంది. క్రిస్ గేల్ కనీస ధర రూ. 2.00 కోట్లు ఉండగా, అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ట్వంటీ 20ల్లో ఘనమైన రికార్డు ఉన్న గేల్ కు అత్యధిక మొత్తం దక్కుతుందని తొలుత భావించారు. కాగా, అనూహ్యంగా గేల్ ను కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. పక్కకు పెట్టడంతో అందరూ షాక్ తిన్నారు

అదే క్రమంలో జో రూట్, మురళీ విజయ్, హషీమ్ ఆమ్లా, మార్టిన్ గప్టిల్, జేమ్స్ ఫాల్కనర్, పార్థీవ్ పటేల్, జానీ బెయిర్ స్టోలను సైతం కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. దాంతో వీరంతా ఈసారి ఐపీఎల్ కు దాదాపు దూరమయ్యారనే చెప్పాలి. ఒకవేళ ఆదివారం చివరిరోజు వేలంలో ఆయా ఆటగాళ్లకు నిర్ణయించబడి ఉన్న కనీస ధర కంటే తక్కువ మొత్తానికి ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిన పక్షంలో మాత్రమే వారు ఐపీఎల్లో ఆడే అవకాశం ఉంటుంది.