శ్రీలంక పర్యటనలో భారత్ తొలి సారి క్లీన్‌స్వీప్‌తో చరిత్ర సృష్టించింది. విదేశీ గడ్డపై మూడు లేదా అంత కంటే ఎక్కువ టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం భారత్‌కు ఇదే తొలిసారి. ఓవరాల్‌గా ప్రత్యర్థిని వైట్‌వాష్ చేయడం టీమ్ఇండియాకు ఐదోసారి. సొంతగడ్డపై మూడు లేదా అంతకన్న టెస్ట్‌ల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురవడం శ్రీలంకకు ఇది రెండోసారి. గతం (2003-04)లో ఆస్ట్రేలియా చేతిలో క్లీన్‌స్వీప్ పరాభవానికి గురైన లంక, ప్రస్తుతం భారత్‌తోనూ అదే ఫలితాన్ని చవిచూసింది.
పల్లెకలెలో జరిగిన మూడో టెస్ట్‌లో మూడో రోజు ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో టీమిండియా విజయ దుందుభి మోగించింది. దీంతో విదేశీ గడ్డపై 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న విరాట్ సేన ఖాతాలో వరుసగా ఐదో సిరీస్ జమ అయ్యింది. ఫాలోఆన్ ఆడుతూ 333 పరుగుల ఇన్నింగ్స్ లక్ష్య చేధనలో శ్రీ లంకను మూడో రోజే టీ విరామ సమయం తర్వాత 181కే భారత్ బౌలర్లు కుప్పకూల్చేశారు. భారత్ తొలి ఇన్నింగ్స్ 487కు ఆలౌట్‌కాగా, శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 135కు కుప్పకూలిన విషయం తెల్సిందే.
19/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడోరోజు ఆట ప్రారంభిం చిన లంకేయుల వికెట్లను అశ్విన్ 4/68,షమీ 3/32తో టపటపమని వికెట్లను కూల్చేసి భారత్‌కు సునాయాస విజయాన్ని అందించారు. గాలెలో 304 పరుగుల తేడాతోను, కొలంబోలో జరిగిన రెండో టెస్ట్‌లో ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి సిరీస్‌ను వశం చేసుకున్న విషయం తెల్సిందే. అయితే భారత్‌ను సిరీస్ క్లీన్ స్వీప్ చేయకుండా అడ్డుకు నేందుకు శ్రీలంక చేసిన పోరాటం ఏ దశలోను సత్ఫలితాలను ఇవ్వలేదు. చండీమాల్ రెండో ఇన్నింగ్స్ లోను ఒంటరి పోరాటం చేసిన ఉపయోగం లేకుండా పోయింది.
ఇంత అలవోకగా శ్రీలంకపై రెండో సారి భారత్ సిరీస్‌ను అది రవిశాస్త్రి సారథ్యంలో టీమిండియా సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవు తోంది. 2015లో టీమ్ డైరక్టర్‌గా 2-0 సిరీస్‌ను సాధించగా, ఇప్పుడు ప్రధాన కోచ్ తొలి సిరీస్‌నే లంకపై 3-0తో వశం చేసుకోవడంలో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను చావుదెబ్బతీయడంలో అశ్విన్, షమీ వికెట్లతో భారత్ విజయాన్ని త్వరగా కానిచ్చేశారు. ఓపెనర్ కరుణ రత్నేను 16 పరుగుల వద్ద అశ్విన్ పెవిలియన్ ముఖం పట్టించాడు.
96 బంతుల్లో తొలి సెంచరీ చేసిన పాండ్యకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్‌లో రెండు సెంచరీలతో పాటు అత్యధికంగా 190 పరుగుల చేసిన శిఖర్ ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కోహ్లీకి ఇది రెండో క్లీన్‌స్వీప్. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయగా, ఇప్పుడు విదేశాల్లో ఆసియా ఖండ దేశమైన శ్రీలంకపై 3-0తో సిరీస్‌ను వైట్‌వాష్ చేయడం గమనార్హం. 29 టెస్టులకు కెప్టెన్సీ వహించిన కోహ్లీకి ఇదీ 19వ టెస్ట్ విజయం. విరాట్‌తో పోల్చుకుంటే ఆసీస్ కెప్టెన్స్ స్టీవా, రికి పాంటింగ్‌లు ఇదే 29 టెస్టుల్లో 21 విజయాలతో ముందున్నారు.