అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఎక్కడ పడితే అక్కడ తీసుకొనే సౌలభ్యం ఏటీఎంలతో లభిస్తున్నది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లుంటే చాలు ఎప్పుడైనా, ఎక్కడైనా డబ్బు తీసుకోవచ్చు. నేడు ఆర్ధిక లావాదేవీలలో అతి సాధారణంగా మారిపోయిన ఈ ఏటీఎం తొలిసారిగా వచ్చి 50 ఏళ్ళు అవుతుంది.
సరిగ్గా 50ఏళ్ల క్రితం లండన్లోని ఎన్ఫీల్డ్ టౌన్లో మొట్టమొదటి ఏటీఎంను ఏర్పాటుచేశారు. ఇప్పుడు ఆ ఏటీఎం స్వర్ణోత్సవం జరుపుకొంటున్నది. 1967 జూన్ 27న లండన్లోని బార్క్లేస్ బ్యాంక్ తన ఎన్ఫీల్డ్ బ్రాంచీ వద్ద ప్రపంచంలోనే తొలిసారిగా ఏటీఎంను ఏర్పాటుచేశారు.
స్కాట్లాంబార్క్లేస్ బ్యాంక్ కు చెందిన స్టీఫర్డ్ బారెన్ అనే ఇంజినీర్ బృందం ఈ మిషెన్ను తయారుచేశారు. తొలి ఆరు లావాదేవీలను బ్యాంకే చేసుకోగా ఈ మిషన్ నుంచి తొలిసారిగా డబ్బులు విత్డ్రా చేసుకున్న వ్యక్తి ప్రముఖ బ్రిటిష్ నటుడు రెగ్ వార్న్.
నేటికి ఈ ఏటీఎం 50ఏళ్లు పూర్తి చేసుకోవడంతో బ్యాంక్ సిబ్బంది. ఏటీఎం ను బంగారు వర్ణంలోకి మార్చడమేగాక, దాని ముందు ఎర్రతివాచీ కూడా ఏర్పాటుచేశారు. మొదట్లో ఆరు అంకెలతో పిన్ నంబర్ ఉండేది. ప్రస్తుతం నాలుగు అంకెలకు మారింది.ఆ తర్వాత సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఏటీఎం డిజైన్, దాని పనితీరులో ఎన్నో మార్పులొచ్చాయి. ప్రస్తుతం డిపాజిట్ చేసుకునే ఏటీఎంలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 30లక్షల ఏటీఎంలు పనిచేస్తున్నాయి.