సౌదీఅరేబియా రాజధాని రియాద్ నగరంలో విషాదకరమైన ఘటన జరిగింది. వడ్రింగి పనులు జరుగుతున్న ఓ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృత్యువాతపడ్డారు. ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సివిల్ డిఫెన్స్ అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. మృతి చెందిన వారిని గుర్తించాల్సి ఉందని అధికారులు ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను అధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా ప్రమాదంలో మృతిచెందిన వారిలో అధికులు కార్మికులేనని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఆవేదనను వ్యక్తం చేశారు.