//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విమానాశ్ర‌యంలో విమానాలు ఢీ...చెల‌రేగిన మంట‌లు

Category : world

ప్ర‌యాణానికి సిద్ధంగా ఉన్న రెండు విమానాలు, విమానాశ్ర‌య ర‌న్ వే మీద‌ ఒక‌దానితో ఒక‌టి గుద్దుకున్నాయి. దీంతో విమానాల వెన‌క‌భాగం నుంచి స్వ‌ల్పంగా మంట‌లు, పొగ చెల‌రేగాయి ఈ ఘటన లో భారీ ప్రమాదం తప్పింది.

టోరంటో విమానాశ్రయంలోని రెండు విమానాలు ఢీ కొన్నాయి. వెస్ట్ జెట్ కు చెందిన విమానం…మెక్సికో నుంచి టోరంటోకు చేరుకుంది. ఇదే టైంలో ఎయిర్ పోర్ట్ లోని గేటు దగ్గర సన్ వింగ్ సంస్థ కు చెందిన విమానం వెనక్కి వెళ్లేందుకు రెడీ అవుతోంది. వెస్ట్ జెట్ కు చెందిన విమానం మరో ప్లైట్ ను ఢీ కొట్టింది. దీంతో ఓ విమానం నుంచి మంటలు వ్యాపించాయి.

వెంటనే అలర్ట్ అయిన అధికారులు వెస్ట్ జెట్ విమానంలో ఉన్న 168 మంది ప్రయాణికులను బయటకు పంపించారు. ఘటనపై కెనడా అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రయాణానికి సిద్దంగా ఉండటంతో అప్పటికే విమానాల్లో ఎక్కి ఉన్న ప్ర‌యాణికుల‌ను ముందు భాగంలో ఉన్న అత్య‌వ‌స‌ర ద్వారాల నుంచి బ‌య‌ట‌కు పంపించారు. కెన‌డాలోని టొరంటో పియ‌ర్స‌న్‌ విమానాశ్ర‌యంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప‌క్క‌నే వేరే విమానంలో ఉన్న ప్ర‌యాణికుడు ఈ సంఘ‌ట‌న‌ను వీడియో తీశాడు.

ఈ రెండు విమానాల‌ను వెస్ట్‌జెట్‌, స‌న్‌వింగ్ విమానయాన సంస్థ‌ల‌కు చెందిన‌విగా గుర్తించారు. ఇరు సంస్థ‌లు ప్ర‌మాదానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న జారీ చేశాయి. కాగా టొరంటో పియ‌ర్స‌న్ విమానాశ్ర‌యంలో ఇలాంటి ప్రమాదం జ‌ర‌గ‌డం ఇది రెండోసారి. ఐదు నెల‌ల క్రితం కెన‌డా, పోలండ్‌ల‌కు చెందిన రెండు విమానాలు ర‌న్‌వే మీద ఒక‌దానిని మ‌రొక‌టి ఢీ కొట్టుకున్నాయి.