//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిజెపి ఎమ్మెల్యేతో సహా 9 మందిపై ఎఫ్‌ఐఆర్‌

Category : national

పంచాయతీ ఎన్నికలలో ప్రత్యర్థి హత్యకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఒక బిజెపి శాసన సభ్యునితో సహా 9 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. బరౌత్‌ నియోజక వర్గ బిజెపి ఎమ్మెల్యే కృష్ణపాల్‌ మాలిక్‌పై హత్య కుట్రకు పాల్పడిన అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసుల కధనం మేరకు బాగ్‌పట్‌లోని హిల్వాది గ్రామంలో అమిత్‌(30) అనే వ్యక్తిపై ఆయన బంధువులు, మాజీ గ్రామ ప్రధాన్‌ దాడి చేశారు. వీరిద్దరూ కూడా గత గ్రామ ప్రధాన్‌ ఎన్నికల్లో అమిత్‌కు ప్రత్యర్థులు. ఈ దాడి ఘటనలో మరో ఐదుగురికి కూడా గాయాలయ్యాయి. బరౌత్‌ కొత్వాలి పోలీస్‌ స్టేషన్‌ పరిథిలో ఈ సంఘటన జరిగినట్లు వారు తెలిపారు.తనపై వచ్చిన ఆరోపణలను బిజెపి ఎమ్మెల్యే మాలిక్‌ తోసిపుచ్చారు. తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ కుట్ర పన్నారన్నారు. ఎటువంటి దర్యాప్తుకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరుపుతామని, నేరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని పోలీసు సూపరింటెండెంట్‌ జైప్రకాష్‌ తెలిపారు.