ఆస్ట్రేలియా విధ్వంశకర ఆటగాళ్ళలో ఒకడు ఆ జట్టు ఓపెనర్ ఆరోన్ ఫించ్. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల సత్తా ఉన్న ఆటగాడు. కాని ఐపియల్ మాత్రం అతనికి అతనికి ఏ మాత్రం కలిసి రావడం లేదు. అదేమిటో ఒక్కసారి చూద్దాం. ఐపీఎల్లో మొత్తం ఏడు ఫ్రాంచైజీలకు ఆడిన ఒకే ఒక్కడుగా ఫించ్ చెత్త రికార్డ్ మూటగట్టుకోగా... ప్రస్తుతం పంజాబ్‌కు ఆడుతున్న ఫించ్ గతంలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, పుణె వారియర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్‌కు ఆడాడు.
ఇది అతనికి కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది. స్టార్ ఆటగాడు అయి ఉండి కూడా ఒక జట్టుకి స్థిరంగా ఆడకపోవడం నిజంగా బాధాకరం. ఇక ఈ సీజన్ లో అతని ఆట ఒక్కసారి చూస్తే..పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫించ్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ సున్న పరుగులకే వెనుదిరిగడం జట్టునే కాదు ఫించ్‌ను కూడా కలిచివేస్తోంది. ఈ రెండు మ్యాచుల్లోనూ ఫించ్ తొలి బంతికే డకౌట్ (గోల్డెన్ డక్) కావడం అతడిని వేధిస్తోంది.తొలి మ్యాచ్ ని ఈనెల 8న ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వివాహం కారణంగా ఆడలేకపోయాడు. విక్టోరియాలో తన గాళ్ ఫ్రెండ్ అమీ గ్రిఫిత్‌ను పెళ్లాడాడు.ఇకనైనా సత్తా చాటాలని ఆశపడుతున్నాడు.