//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం సీరియస్....!

Category : national

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. కిడ్నీల సమస్యతో బాధపడుతున్న ఆయన ఆ సమస్య ప్రస్తుతం మరింతగా జటిలంగా మారినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే గత కొంత కాలంగా జైట్లీ కిడ్ని సమస్యతో బాధపడుతున్నారు. త్వరలో ఆయనకు శస్త్ర చికిత్స చేయాల్సి రావచ్చు. ఈ నేపధ్యంలోనే ఆయన త్వరలో చేపట్టబోయే లండన్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు.

అయితే సోమవారం నుంచి విధులకు హాజరు కావడం లేదు. ఆయన రాజ్యసభ సభ్యత్వం ఏప్రిల్‌ రెండో తేదీతో ముగిసింది. దీనితో బిజెపి అధిష్టానం ఆయనకు యుపి నుంచి ప్రాతినిధ్యం కల్పించింది.తిరిగి యూపీ నుంచి ఎన్నికైన ఆయన తాజాగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకూ చేయలేదు.సభకు కూడా హాజరు కావడం లేదు. ఇన్ఫెక్షన్‌ పెరుగుతుందని బయటకు వెళ్లవద్దని డాక్టర్లు హెచ్చరించడంతో...

ఆయన ఇంట్లో నుంచే ఫైల్స్‌పై సంతకాలు చేస్తున్నారు. ఎయిమ్స్‌ వైద్యులు కూడా ఇంట్లోనే చికిత్స చేస్తున్నారు.అయితే కొద్ది రోజుల్లో ఆయన ఎయిమ్స్‌లో చేరవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. శస్త్ర చికిత్స చేయించుకుంటే మాత్రం నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి రావచ్చని తెలిపారు. జైట్లీకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయాల్సి ఉందని, కిడ్నీ దాతకు సంబంధించిన లాంఛనాలను పూర్తి చేయాల్సి ఉందని సాధు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా మరో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఈ సమస్యను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.