Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఫ్లిప్‌కార్ట్‌ లో జాబ్స్.......యువత కి చక్కని అవకాశం...!

Category : business

ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పుడు ప్రపంచంలోనే ఆన్ లైన్ సేవలలో దూసుకుపోతుంది. ఈ ఫ్లిప్‌కార్ట్‌ లో యువత కి కావలిసిన అన్ని రకాలైన మోడరన్ ఐటమ్స్ తో పాటుగా, అన్ని రకాల వయసు వారికీ కావలిసిన వస్తువు లభిస్తున్నాయి. ఫాస్ట్ డెలివరీ, ఫ్రీ డెలివరీ తో ఫ్లిప్‌కార్ట్‌ అన్నికంటే వేగంగా దూసుకుపోతుంది.

ఇప్పుడు ఈ ఫ్లిప్‌కార్ట్‌ యువతకి మరో చక్కని అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు కోరారు. పదో తరగతి పాస్‌/ఫెయిల్‌, ఇంటర్‌ పాస్‌/ఫెయిల్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారికి కంప్యూటర్‌ ఆపరేటర్లు పోస్టులు 100 ఖాళీగా వున్నాయని పేర్కొన్నారు. జీతం రూ.10 వేలు ఉంటుందని, 18 నుంచి 32 ఏళ్ల యువకులు అర్హులని తెలిపారు.

రవాణా, భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారన్నారు. వీటితో పాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ యువకులు ఈ నెల 26, 27వ తేదీల్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.

అభ్యర్థులు www.vzmcareers.com నందు వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. నమోదు చేసుకున్నవారికి సెల్‌ఫోన్‌ ద్వారా మెసేజ్‌ ఇస్తారని పేర్కొన్నారు. ఇంటర్వ్యూకు విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు రెసిడెన్సీ సర్టిఫికెట్‌ను కూడా తీసుకురావాలని డీఆర్‌ డీఏ పీడీ ఓ ప్రకటనలో తెలిపారు.ఈ అవకాశం ఈసారికి కేవలం విజయనగరం జిల్లా అభ్యర్థులకు మాత్రమే.