సాకర్ మేధావులు ఏది ముందుగా ఉహించారో అదే జరిగింది.ఫ్రాన్స్ విశ్వవిజేతగా నిలిచింది. రెండోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగిన హోరాహోరీ ఫైనల్లో క్రొయేషియాపై ఫ్రాన్స్ 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది.
ఆట హోరాహోరీగా సాగినా క్రొయేషియా చేసిన తప్పిదాలకు మూల్యం చెల్లించుకుంది. ఆట 18వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు మారియో మాండ్జుకిక్ చేసిన తప్పిదం వల్ల ఫ్రాన్స్‌కు తొలి గోల్ లభించింది. ఫ్రాన్స్ ఫుట్‌బాలర్ ఆంటోయిన్ గ్రీజ్మన్ ఇచ్చిన ఫ్రీ కిక్‌ను మాండ్జుకిక్ తలతో సెల్ఫ్ గోల్‌గా మలిచాడు. ప్రపంచ కప్ చరిత్రలో ఫైనల్లో సెల్ఫ్ గోల్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఫ్రాన్స్ తో తలపడిన క్రొయేషియా చాలా సేపు విజయం కోసం పోరాడిందని చెప్పవచ్చును..ఆట 28వ నిమిషం వద్ద ఇవాన్ పెరిసిక్ అద్భుతమైన కిక్‌తో క్రొయేషియాకు తొలి గోల్ అందించాడు. దీంతో 1-1తో స్కోరు సమమైంది. అయితే 36వ నిమిషం వద్ద క్రొయేషియా బాక్స్‌లో ఇవాన్ పెరిసిక్ చేతికి బంతి తగిలింది.
దీంతో రిఫరీ ఫ్రాన్స్‌కు పెనాల్టీ ఇచ్చారు. పెనాల్టీని గ్రీజ్మన్ గోల్‌గా మలిచి ఫ్రాన్స్‌ను లీడ్‌లోకి తీసుకెళ్లాడు. హాఫ్ టైమ్ ముగిసేసరికి 2-1తో ఫ్రాన్స్ ముందంజలో ఉంది.విశ్వవిజేతగా ఫ్రాన్స్ ప్రపంచ సత్తా చాటింది..