//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఫేస్ బుక్ ఫ్రెండ్ అని నమ్మితే సర్వస్వం దోచేశాడు

Category : world

ఆమే పేరు నందిత మోహన్ రావు. బెంగళూరులోని బనశంకరిలో ఉంటుంది.

అందరి లాగే తానూ కూడా ఫేస్ బుక్ బాగా వాడుతుంది. అయితే చాటింగ్ లో రెండు నెలల క్రితం ఇంగ్లండ్ కు చెందిన మైఖేల్ డెన్నీస్ తో పరిచయమైంది. తనను తాను ధనవంతుడిగా పరిచయం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. అలా ఇద్దరి స్నేహం వాట్సప్ నెంబర్స్ షేర్ చేసుకునే వరకు వెళ్లింది.

ఒకరోజు తను ఇండియా వస్తున్నానని.. హార్ట్ సర్జరీ కోసం అని చెప్పాడు. దీంతో జాలి పడింది నందిత. ప్లాన్ వర్క్ అవుట్ అయింది అనుకున్న మైఖేల్.. ఎయిర్ పోర్టులో ఉన్నానంటూ కథలు అల్లాడు. అంతలోనే నందితకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి అంటూ ఓ లేడీ ఫోన్ చేసింది. మీ ఫ్రెండ్ మైఖేల్ తమ దగ్గర ఉన్నాడని.. అతని దగ్గర ఇంగ్లాండ్ కరెన్సీ ఉందని.. అతన్ని విడుదల చేయాలంటే రూ.50వేలు డిపాజిట్ చేయాలని కోరింది.

అయ్యో పాపం… స్నేహితుడు ఇబ్బందుల్లో ఉన్నాడని భావించి వెంటనే వారి చెప్పిన అకౌంట్ కి డబ్బులు పంపించింది. ఆ తర్వాత వరసగా లక్షా 55వేలు, రూ.4లక్షల 80వేలు పంపింది. ఇలా మూడు విడతలుగా రూ. 6.85లక్షలు డబ్బులు పంపింది నందిత. ఒక రోజు RBI ఆఫీస్ నుంచి అంటూ ఫోన్ కాల్ వచ్చింది. రూ. 8 లక్షలు డిపాజిట్ చేయాలని కోరారు. అప్పుడుగానీ నందితకు అనుమానం రాలేదు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులు ఎందుకు డిపాజిట్ చేయమని కోరుతుంది అనే డౌట్ వచ్చింది. వెంటనే మైఖేల్ కి కాల్ చేసింది. అందుబాటులో లేడని రిప్లై వస్తుంది. అతని వాట్సాప్, ఫేస్ బుక్ కు మెసేజ్ పంపింది. అయినా సమాధానం రాలేదు. మోసపోయాను అని గ్రహించిన నందిత.. పోలీసులకు కంప్లయింట్ చేసింది. నందిత కంప్లయింట్ ను గోప్యంగా ఉంచిన బెంగళూరు పోలీసులు.. మైఖేల్ టచ్ లోకి వెళ్లారు. బ్యాంక్ నెంబర్లు, ఫోన్ డీటెయిల్స్ ఆధారంగా ఢిల్లీలో మైఖేల్ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.