//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కన్న తండ్రే ....యముడు

Category : national

ప్రేమ జంటలని అతి కిరాతకం గా చంపి దానికి పరువు హత్య అని ముసుగు వేసుకుంటుంది ఈ సమాజం.ఇలాంటి హత్యలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి ప్రేమ పెళ్లిలే ఒక శాపంగా మారాయి తల్లిదండ్రులని ఒపించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న జంటలు , ఒపించి మరి హత్యలకు గురవుతున్నారు.

వివరాలోనికి వెళ్తే కేరళలోని అరిక్కోడ్‌ లో నివాసం ఉంటున్న రాజన్ అనే తండ్రి తన కన్న కూతుర్నిఅతి కిరాతకంగా చంపేశాడు అతిర (21) అనే యువతి సైనికుడిగా పనిచేస్తున్న యువకుడిని ప్రేమించింది.అది తన తలిదండ్రులకి చేపి పెళ్ళిచేసుకోవాలని చూసింది రాజన్ ఆ యువకుడి గురించి ఆరా తీయగా అతను ఒక దళిత జాతికి చెందిన వాడని తెలిసింది పెళ్ళికి నిరాకరించిన అతను అతిర బలవంతం మేరకు ఒప్పుకున్నాడు.

ఇరు కుటుంబాల ఒప్పందంతో ఈ రోజు (మార్చ్ 23 ) న వివాహ తేదీ ఫిక్స్ చేసారు పెళ్లి ఏర్పాట్లు సెరవేగంగా జరుగుతున్నాయి దళితుడిని అల్లుడిగా ఒప్పుకొని రాజన్ గురువారం సాయంత్రం మరో సారి అతిర తో గొడవ పడ్డాడు దీంతో కోపద్రిక్తుడైన రాజన్ పదునైన ఆయుధంతో కుమార్తెని విచక్షణారహితంగా పొడిచాడు. బాధితురాలి కేకలతో అక్కడి వచ్చిన బంధువులు.. ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు.పరువు కోసం కన్న కూతుర్ని పొట్టన పెట్టుకున్న నిందితుడ్ని పోలీస్ లు అదుపులోనికి తీసుకొని విచారణ జరుపుతున్నారు