//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చదువుకుంటానంటే చంపేస్తారా.. కన్నతండ్రి కిరాతకం..!

Category : national

దేశంలో నానాటికి పెరిగిపోతున్న అరాచకాలు.ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన వయసులో వయసుకు మించి కష్టపడుతున్న బాలలు.చిన్న పిల్లలపై దాడులకు పాల్పడుతున్న తల్లిదండ్రులు.ఈ మధ్యకాలంలో రోజరోజుకి పెరిగిపోతున్నారు.మొన్న బెంగళూరులో,నిన్న జైపూర్ లో చిన్న పిల్లలపై దాడి చేసిన తల్లిదండ్రులను చూసి దేశం నివ్వెరపోయింది.కన్న తల్లిదండ్రులే ఇలా చేస్తే ఆ చిన్నారులు తమ భాధలు ఎవరితో చెప్పుకుంటారంటూ దేశ ప్రజలలో ఆగ్రహం వ్యక్తం అయింది.

సరిగ్గా అలాంటి ఘటన మరొకటి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో వెలుగు చూసింది.ఫ్రిబ్రవరి 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.చదువుకునేందుకు పాఠశాలకు వెళతానన్న 11 ఏళ్ల కూతుర్ని చెట్టుకు ఉరి వేసి చంపేందుకు యత్నించిన కసాయి తండ్రి బాగోతం బయటపడింది.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అలీపుర్దౌర్ జిల్లా పంచకెల్ గురి గ్రామానికి చెందిన దిలీప్ ముందా అనే గిరిజన వ్యక్తి తన భార్య మరణించడంతో జంబి అనే అమ్మాయిని మరో పెళ్లి చేసుకున్నాడు.దిలీప్ కు ముగ్గురు కుమార్తెలు. అపర్ణ,శ్యామలిక,కమలిక.సవతి తల్లి అయిన జాంబి పిల్లలతో ఇంటి పనులు చేయిస్తూ వాళ్ళకి సరిగ్గా ఆహరం పెట్టకుండా హింసించేది.దీంతోపాటు పాఠశాలకు చదువుకోవడానికి ఎందుకని ఇంట్లోనే ఉండి పనిచేయమని చెప్పేది.

ఈ సమయంలో కమలిక (11) తాను చదువుకునేందుకు పాఠశాలకు వెళతానని అనడంతో ఆగ్రహించిన తండ్రి దిలీప్ చెట్టు వద్దకు తీసుకువెళ్లి ఆ చిన్నారిని ఉరివేసి చంపేందుకు ప్రయత్నించగా,ఇరుగుపొరుగువారు కాపాడి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు తండ్రిపై కేసు నమోదు చేసి విషయాన్ని శిశుసంక్షేమశాఖాధికారులకు తెలియజేశారు.