//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నిరాహారదీక్ష చేస్తున్న మేధా పాట్కర్ అరెస్ట్

Category : national

సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ నిర్వాసితులు అందరికి పూర్తిగా పునరావాసం కల్పించాలని కోరుతూ గత 12 రోజులుగా  నిరాహార దీక్ష చేస్తున్న నర్మదా బచావో ఆందోళన నాయకురాలు  మేధా పాట్కర్ ను సోమవారం రాత్రి పోలీస్ లు అరెస్ట్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నా వైద్య సహాయం స్వీకరించడానికి తిరస్కరిస్తూ ఉండడంతో మధ్య ప్రదేశ్ ధార్ జిల్లా చిఖల్డా గ్రామంలో ఆమె దీక్షను పోలీస్ లు భగ్నం చేశారు. ఆమె, మరో 11 మందితో కలసి జులై 27 నుండి దీక్ష  చేస్తున్నారు.

పునరావాసం గురించి అధికారులు చెబుతున్న గణాంకాలను ఆమె ఖండిస్తూ ఉండగా, ఆమె ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ప్రభుత్వం విమర్శిస్తున్నది. అయితే ఆమెను దీక్ష విరమించమని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్, కేంద్ర మంత్రి ఉమా భారతి తదితరులు విజ్ఞప్తి చేసినా ఆమె పట్టించుకోలేదు. ఇండోర్ కు చెందిన ధార్మిక వేత్త భైయ్యాజీ మహారాజ్ కూడా ఆమెను కలసి దీక్ష విరమించమని కోరారు.

ఆమెను అరెస్ట్ చేస్తున్న సందర్భంగా పోలీస్ లకు, నర్మదా బచావ్ ఆందోళన కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీస్ లు లాఠీచార్జి జరిపి పలువురిని గాయపరచిన్నట్లు ఉద్యమకారులు ఆరోపించారు. అయితే పలువురు పోలీసులు గాయాలకు గురయ్యారని అధికారులు పేర్కొన్నారు. ఎటువంటి మాటలు, సంప్రదింపులు లేకుండా సుమారు రెండు వేలమంది పోలీస్ లు వచ్చి, దౌర్జన్యంగా ఆమెతో పాటు దీక్ష చేస్తున్న మరో ఐదుగురిని తరలించారని ఉద్యమకారులు ఆరోపించారు.

పూర్తి పరిహారం, పునరావాసం లేకుండా అక్రమంగా, అన్యాయంగా నర్మదా లోయలో నివసిస్తున్న 40 వేల కుటుంబాలను తొలగించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మేధా పాట్కర్ తో పాటు మరో నలుగురు మహిళలను కూడా అరెస్ట్ చేశారు. పాట్కర్ ను ఇండోర్ లోని ఆసుపత్రిలో చేర్చగా, మరో ఐదుగురిని ధార్ లోని ఆసుపత్రిలో చేర్చారు. కాగా మిగిలిన ఆరుగురు దీక్షను కొనసాగిస్తున్నారు.