//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నిరసన తెలపడం కోసం యోగ చేయనున్న రైతులు !

Category : national

జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవంలో పాల్గొని జాతీయ రహదారులపై యోగ జరపడం ద్వారా తమ నిరసనలను ప్రభుత్వానికి తెలపాలని రైతులు సిద్దపడుతున్నారు. విభిన్న రీతులలో తమ నిరసన తెల్పడం ద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకున్న తమిళనాడు రైతులను ఆదర్శంగా తీసుకొని భారత్ కిసాన్ యూనియన్ తమ ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటించింది.

జూన్ 21న ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మధ్య ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ లలో జాతీయ రహదారులపై ఉదయం 9 నుండి 12 గంటల వరకు రైతులు యోగ జరుపుతారని యూనియన్ ప్రతినిధి రాకేష్ టికాయత్ తెలిపారు. ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద యూనియన్ గురువారం జరిపిన కిసాన్ పంచాయత్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుండి వేలాదిమంది రైతులు పాల్గొననున్నారు. స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్, సీపీఐ నాయకుడు అతుల్ కుమార్ అంజాన్, స్వామి అగ్నివేశ్ వంటి నాయకులు ఈ నిరసనలో పాల్గొననున్నారు. 

రైతుల రుణాలు అన్నింటిని రద్దు చేయాలని, ఉత్పత్తి ఖర్చులకు మించి 50 శాతం అదనంగా మద్దతు ధరలు ఉండాలని స్వామినాధన్ కమీషన్ సిఫార్సును అమలు చేయాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమస్యలకు సంబంధించి ఆచరణాత్మక  పరిష్కారాలు చూపడానికి మరో నూతన కమీషన్ ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు. మధ్య ప్రదేశ్ లో పోలీస్ కాల్పులలో ఆరుగురు రైతులు చనిపోయినప్పటి నుండి రైతు ఉద్యమాలు పలు రాష్ట్రాలలో తీవ్రతరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.