//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రభుత్వ మొద్దునిద్రతోనే రైతుల ఆందోళన

Category : national politics

మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వం మొద్దునిద్ర పోవడం వల్లే రైతులు ఆందోళనకు దిగారని ఎన్సీపీ అధినేత శరద్ పవర్ విమర్శించారు.  రైతుల సాకుతో రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని కొందరు కోరుకుంటున్నారని ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలను 'పిల్లతనం చేష్టలు'గా పవార్ కొట్టిపారేశారు. 

రైతులు చేసిన  సమ్మెలో ఏ రాజకీయ పార్టీ పాల్గోలేదని, రైతు ప్రతినిధుల సారథ్యంలోనే సమ్మె జరిగిందనే విషయాన్ని ఫడ్నవిస్ గ్రహించాలని మాజీ ఉప ప్రధాన మంత్రి పవర్ హితవు పలికారు. 

కాగా, నరేంద్ర మోదీ మూడేళ్ల పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందని శరద్ పవార్ విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తి పడిపోయిందని, పెట్టుబడులు తగ్గిపోయాయని, ఉపాధి కల్పన అతి తక్కువగా ఉందని అన్నారు. 

ఎన్‌సీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవార్ మాట్లాడుతూ, దేశంలో రాజకీయ పరిస్థితి ఏమాత్రం సజావుగా లేదని, ప్రజలు తీవ్ర అంసతృప్తితో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.