తమ ఉత్పత్తికి గిట్టుబాటు ధరలేక, కనీస రవాణా ఖర్చులను కూడా రాబట్టుకోలేని పరిస్థితిలో ఉన్న రైతాంగాన్ని ఆడుకుంటామంటూ కేంద్రమంత్రి ప్రకటించారు. దళారుల మోసాలను అంతమొందించే దిశగా కేంద్రప్రభుత్వం క్వింటాలు మిర్చికి రూ. 5000 ప్రోత్సాహాన్ని ప్రకటించడం, రాష్ట్రప్రభుత్వం ప్రోత్సాహకం రూ.1250 తోడైతే క్వింటాలకు 6250 రూపాయల ధర లభించే అవకాశం కలగడంతో మిర్చి రైతులు ఊపిరి పీల్చుకున్నారు.తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ఈ సీజన్లో మిర్చి విపరీతంగా పండటం , ధరలను సాకుగా చూపి క్వింటాలకు 3 లేదా 4 వేలు కంటే ఎక్కువ ఇవ్వలేమంటున్న దళారుల బారినుండి , కేంద్ర ప్రభుత్వ ప్రకటన భాదిత రైతులను ఆడుకున్నట్లయింది. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మిర్చి పంటకు క్వింటాలకు కనీసం రూ.8000 ఉండాలన్నారు.