//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జనసేన సభకు పాదయాత్రగా బయల్దేరిన అభిమానులు....!

Category : politics

గుంటూరు జిల్లా ఈ రోజు సాయంత్రం 3 గంటలకు ప్రారంభం కానున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తు జనం తరలివస్తున్నారు. ప్రత్యేక వాహనాల్లో జనసేన నేతలు, కార్యకర్తలు, పవన్ అభిమానులు సభా ప్రాంగణానికి బయలుదేరారు.

జనసేన జాతీయ ఐక్యత పేరిట విజయవాడ నుంచి జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాదయాత్ర చేస్తూ ఆవిర్భావ సభ కు బయలుదేరి వెళ్లారు. పార్టీ నేత ముత్యంశెట్టి కృష్ణారావు ఆధ్వర్యంలో జాతీయ జెండా రంగులతో దుస్తులు ధరించిన జనసేన కార్యకర్తలు, యువత ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.

విజయవాడ కనకదుర్గ వారధి నుంచి నంబూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో గల సభా వేదిక వరకు పాదయాత్ర జరగనుంది. ఇప్పటికే అభిమానులు, కార్యకర్తలు సభాప్రాంగణానికి చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 2 గంటల తరువాత విజయవాడ లోని హోటల్ నుండి బయలుదేరుతారు. ఈ సభకు పవన్ కళ్యాణ్ ను భారీ కాన్వాయ్ తో విజయవాడ నుండి అయన అభిమానులు తీసుకురానున్నారు.