ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కోసం రిజిస్ట్రేషన్ ఆఫీసులో అదనపు మొత్తం చెల్లించడం సహజమే. కానీ ఆస్ట్రేలియాలో ఈ వెర్రి శృతి మించి ఓ వ్యక్తి సింగిల్ డిజిట్ 4 నెంబర్‌ను రికార్డు ధర పెట్టి కొన్నాడు. ఆ వ్యక్తి 13 కోట్లు(2 మిలియన్ల డాలర్లు) పెట్టి తనకు ఇష్టమైన నెంబర్ ప్లేట్‌ను సొంతం చేసుకున్నాడు.
సిడ్నీ ఆక్షన్ హౌజ్‌లో జరిగిన వేలంలో అతను ఆ నెంబర్‌ను గెలుచుకున్నాడు. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రానికి చెందిన నెంబర్లకు ఇప్పటికీ ఎక్కువ మోజు ఉంది. అయితే ఈ బ్లాక్ అండ్ వైట్ నెంబర్‌ను చైనాకు చెందిన బిలియనీర్ పీటర్ సెంగ్ కొన్నట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొన్నది. అతను ఆస్ట్రేలియాలో సెక్స్ టాయ్స్ వ్యాపారం చేస్తున్నాడు.
చైనీయుల సాంప్రదాయం ప్రకారం నెంబర్ 4ను దురదృష్టసంఖ్యగా భావిస్తారు. ఆ పదాన్ని పలికితే అది మరణం అని వినిపిస్తుందట. ఎటుంవటి నెంబర్ ను ఏరి కోరి ఎందుకు కైవసం చేసుకున్నాడో అని విస్మయం కలుగుతుంది.
సాధారణంగా ఆస్ట్రేలియాలో సింగిల్ నెంబర్ ప్లేట్‌కు ఎక్కువ క్రేజీ ఉంటుంది. అవి ఎక్కువ శాతం ఒకే ఫ్యామిలీలో ఉంటాయి. కొన్ని తరాల వరకు ఆ నెంబర్లు పాస్ అవుతూనే ఉంటాయి. ఓపెన్ మార్కెట్‌కు వచ్చే వరకు ఇలా సాగుతుంది. అయితే సింగిల్ డిజిట్ నెంబర్ 4ను సొంతం చేసుకున్న చైనా వ్యాపారవేత్త సిడ్నీ ఆక్షన్ హౌజ్‌కు కూడా సింగిల్ డిజిట్ నెంబర్ 2 ఉన్న ఫెరారీ కారులో వెచ్చాడు.
అతనికి హాంగ్‌కాంగ్‌లో నెంబర్ 1 ప్లేట్ ఉన్న కారు ఉంది. అంతేకాదు, సిడ్నీలోనూ అతని దగ్గర ఉన్న మెర్సిడీస్ కారుకు వన్ నెంబర్ ప్లేట్ ఉంది. గతంలో నెంబర్ 4 ప్లేట్ మిచిలిన్ టైర్ ఓనర్ల ఫ్యామిలీ చేతిలో ఉండేది. ఇప్పుడు అది మార్కెట్‌కు రావడంతో చైనా వ్యాపారవేత్త దాన్ని సొంతం చేసుకున్నారు.