Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవన్ ఫాన్స్ కి పిచ్చి పీక్స్ కి వెళ్ళటం అంటే ఇదేనేమో...!

Category : politics movies

సాధారణంగా అభిమానులు తమ అభిమానాన్ని రకరకాలుగా చూపించుకుంటూ వుంటారు. అటు సినీ ఇండస్ట్రీని , ఇటు రాజకీయాలన్నీ శాసించిన వ్యక్తుల్లో మన తెలుగు వాడు ఎన్టీఆర్ ఒకరు. అప్పట్లో ఆయన్ని ప్రతి ఒక్క తెలుగువాడు కులాలకు అతీతంగా ఆదరించారు.

ఆయనపై వున్న అభిమానాన్ని చాలా హుందాగా చూపించేవారు. తరువాత ఎన్టీఆర్ సీఎం అయిన తరువాత ఇచ్చిన మాట కి కట్టుబడి తెలుగు వారికీ రకరకాల పథకాలు పెట్టి తెలుగు ప్రజల మన్నలని పొందారు. ఇక ఆ తరువాత సినీ ఇండస్ట్రీ ని ఏలిన మెగాస్టార్ చిరంజీవి తాను కూడా రాజకీయాల్లో కి ఎన్టీఆర్ లనే వచ్చారు. కానీ తాను ఒక వర్గానికే పరితమై ,రాజకీయాలలో ఘోరాతి ఘోరం గా విఫలమయ్యాడు. దీనికి ముఖ్య కారణం తన చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదా తన అభిమానులు కావచ్చు.

అప్పట్లో అభిమానులు చూపించిన అతి ఉత్సహంతో మిగిలిన వర్గాల ఓటుబ్యాంక్ ని కోల్పాయారు. ఇప్పుడు తన తమ్ముడు జనసేన పార్టీ పెట్టి ప్రజలకి అది చేస్తాం..ఇది చేస్తాం అని చెప్పుకుంటూ పోతున్నాడు. పార్టీ పెట్టి ప్రశ్నిస్తా అంటూ రాజకీయాలలోకి వచ్చి ఏంచేస్తున్నాడో ఆయానికే కాదు కదా రాష్ట్ర ప్రజానీకానికి కూడా అర్థంకావటంలేదు.

ఇక వచ్చే ఎన్నికల్లో జనసేనదే అధికారం అంటూ తన సభలతో ముందుకుపోతున్నాడు. ఎన్నికలకి ఇంకా కొద్ది సమయమే వుంది కానీ ఇప్పటివరకు జనసేనకి క్యాడర్ కూడా లేదు. మరోసారి పవన్ కూడా ఒకేసామాజిక వర్గాన్ని , తన అభిమానులని నమ్ముకొని రాజకీయంలో ఎదగాలని చూస్తున్నాడు. అభిమానులని నమ్ముకొని ఎన్నికలలో పోటీ చేస్తే మాత్రం తన అన్న కంటే ఘోర ఓటమిని చవిచూస్తాడని సమాచారం. ఎందుకంటారా పవన్ అభిమానులు అయన ను దేవుడిగా పోల్చటం తప్పులేదుకాని, మరీ గుడి కట్టించేంత పిచ్చి ఎందుకు వచ్చిందో ..వాళ్ళకివాళ్ళు ఒక ప్రశ్న వేసుకుంటే తెలుస్తుంది....ముఖ్యంగా సోషల్ మీడియా పవన్ ని నట్టేట ముంచేదానికి రెడీ గ వుంది. అది ఎలా అంటారా అతనా వర్గానికి చెందిన అభిమానులు పెట్టె పోస్టింగ్ లు చుసిన ఇతర జనాలు చూసి నవ్వుకుంటున్నారు.