//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రముఖ నవలా రచయిత్రి......యద్దనపూడి సులోచనారాణి మృతి...!

Category : national state

ఇది తెలుగు నవలా లోకానికి తీరని లోటు , తెలుగు సాహిత్యాన్ని ఎంతో గొప్ప స్థాయి కి తీసుకుపోయిన యద్దనపూడి సులోచనరాణి గారు నిన్న రాత్రి అమెరికాలో నిద్రలోనే తన చివరి శ్వాసను విడిచారు. ప్రస్తుతం వృద్ధాప్యం మీద పడటంతో తన కుమార్తె శైలజ వద్ద కాలం గడుపుతున్న యద్దనపూడి సులోచనారాణి 79 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

గత రాత్రి నిద్రలోనే ఆమె కన్నుమూశారని శైలజ వెల్లడించారు. గుండెపోటు వచ్చిందన్న విషయం ఎవరికీ తెలియదని, కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లే సమయం కూడా లేకపోయిందని ఆమె తెలిపారు. తన తల్లి అంత్యక్రియలు స్వదేశంలో చేయాలని ఉన్నప్పటికీ, పరిస్థితులు అనుకూలించని కారణంగా కుపర్డినోలోనే ముగించనున్నట్టు స్పష్టం చేశారు.

తమకు ఎంతో మంది ఫోన్ కాల్స్ చేసి సంతాపం చెబుతున్నారని, వారందరూ చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలని అన్నారు. తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేసిన యద్దనపూడి సులోచనారాణి మృతి నవలా లోకానికి తీరని లోటని పలువురు రచయితలు వ్యాఖ్యానించారు.