//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిలియన్ల లో న‌కిలీ ఫేస్‌‌బుక్ ఖాతాలు..!

Category : national

ఆధునిక జీవన శైలి ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి న‌కిలీల ప్ర‌భంజ‌నం ఎక్కువైంది. ఈ నకిలీ మకిలీ కేవ‌లం వ‌స్తువుల‌కే కాదు.ఆన్‌లైన్ ఖాతాల విష‌యంలో సైతం బెడ‌ద ఎక్కువైంది. మామూలుగా అయితే త‌యారీ ఉత్ప‌త్తులు, ఆహార ప‌దార్థాల విష‌యంలో న‌కిలీ వాటి గురించి బాధ‌ప‌డ‌తాం. కానీ ఫేస్‌బుక్ ఖాతాల విష‌యంలో సైతం ఆ ధోర‌ణి బాగా ముదిరింది.

డిసెంబ‌రు 2017 నాటికి 20 కోట్ల న‌కిలీ ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్నాయంటే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మొత్తం ఫేస్‌‌బుక్ ఖాతాల్లో దాదాపు 10 శాతం నకిలీవేన‌ని ఆ సంస్థ త‌న వార్షిక నివేదిక‌లో పేర్కొంది. అభివృద్ది చెందుతోన్న దేశాల్లోనే ఎక్కువ‌గా ఈ న‌కిలీ ఖాతాల వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న‌ట్లు నివేదిక‌లో బహిర్గతం చేసింది.

ఇండియా, ఇండోనేషియా, బ్రెజిల్, ఫిలిప్పీన్స్ తదితర దేశాలలో నకిలీ ఖాతాలు ఎక్కువగా ఉన్న‌ట్లు ఫేస్‌బుక్ సంస్థ తెలిపింది. ఈమేరకు డిసెంబర్ 2017తో ముగిసే నాలుగో త్రైమాసిక నివేదికలో ఎఫ్‌బీకి 213 కోట్ల‌ యాక్టివ్ ఖాతాదారులు ఉన్నట్లు పేర్కొంది.

డిసెంబర్ 31,2016తో పోలిస్తే యాక్టివ్ యూజర్ల సంఖ్య 14 శాతం పెరిగిందని వివరించింది. కాగా, ఇండియా, ఇండోనేషియా, వియత్నాం దేశాల్లోని వ్యక్తుల వల్లే తమ ఖాతాదారుల సంఖ్యలో పెరుగుదల చోటుచేసుకుందని, 2017లో యాక్టివ్ యూజర్ల సంఖ్య పెరుగుదలకు కారణం ఇదేనని తెలియజేసింది. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఉన్న ఇలాంటి ఖాతాల‌ను త్వ‌ర‌లోనే నిలిపివేస్తామ‌ని ఫేస్‌‌బుక్ ప్ర‌క‌టించింది. 2016 డిసెంబరు నాటికి 1.86 బిలియన్ల ఫేస్‌బుక్ ఖాతాల్లో 114 మిలియన్లు నకిలీవే కావడం గమనార్హం.

Related News