Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఫోన్ లో ఒకటి నొక్కితే కొంప మునిగినట్టే

Category : technology

మోసాలు పలు రకాలు. కాలం మారుతున్న కొద్ది మాసాల్లో కూడా అనేక మార్పులు వచ్చి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మొబైల్ వాడకం పెరగడంతో ఆ విధంగా మోసాలు చేస్తున్నారు. వివిధ కంపెనీల నుంచి మొబైల్‌ఫోన్లకు వస్తున్న కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీసీఎస్‌ పోలీసులు సూచించారు. డీసీపీ, ఏసీపీలతోపాటు పోలీ్‌సస్టేషన్ల స్థాయిలో ఈ ప్రచారాన్ని కల్పించి ప్రజలు మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వారు ఎలా చేస్తారు అంటే... ముందు సర్వీస్‌ కాల్‌ అని ఫోన్‌ చేస్తారు. కొంత సమయం వరకు మీ ఫోన్‌ నెట్‌వర్క్‌ పనిచేయదు. వెంటనే మీకు కాల్‌ వస్తుంది. ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌లాంటి కంపెనీల పేర్లు చెప్పి నెట్‌వర్క్‌లో సమస్య ఉందని చెబుతారు. అది పరిష్కారం కావాలంటే మీ ఫోన్‌ నుంచి ఒకటో నెంబర్‌ నొక్కమని చెబుతారు. మీరు ప్రెస్‌ చేయగానే నెట్‌వర్క్‌ మరోసారి పూర్తిగా పనిచేయదు. ఫోన్‌ హ్యాక్‌ అయినట్టే. దీన్నే సిమ్‌ స్వాప్‌ అంటారు.

మీ నెంబర్‌ మరో ఫోన్‌పై పనిచేయడం ప్రారంభించి అకౌంట్‌లోని డబ్బులు మాయమవుతాయి. ఇలాంటి ఫిర్యాదులు వచ్చినట్లు గుర్తించిన సీసీఎస్‌ పోలీసులు ఈ తరహా మోసాల గురించి అవగాహన కల్పించే పనిలో నిమగ్నమయ్యారు. ఓటీపీ, బ్యాంకు, ఆధార్‌ వివరాలతోపాటు నెట్‌వర్క్‌ సమస్యల పేరిట వచ్చే ఫోన్‌కాల్స్‌పై స్పందించొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీనిపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని పోలీ్‌సస్టేషన్లకు సమాచారం ఇచ్చారు.