//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దళితుల పై కక్ష

Category : politics

ఆంధ్రప్రదేశ్‌లో దళితులను అనగదొక్కడనికే తెలుగుదేశం ప్రభుత్వం దళిత తేజం కార్యక్రామాన్ని ప్రారంభించిందని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్‌ మండిపడ్డారు.

అధికారం చేపట్టినప్పటినుంచి దళితులను విస్మరించిన ప్రభుత్వం, త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దళితులపై కపట ప్రేమ నటిస్తోందని ఆయన విమర్శించారు.

తమకు అనుకూలంగా లేని, బెదిరింపులకు లొంగని ప్రభుత్వ ఉద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని జోగి రమేష్‌ మండిపడ్డారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్న ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ పద్మ సుజాతను బదిలీ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

తమ అడుగులకు మడుగులొత్తలేదనే నెపంతో ఒక మహిళా అధికారిని బదిలీ చేయడం ఎంతవరకూ సమంజసం అంటూ ప్రశ్నించారు. దళితులను వేధిస్తున్న ప్రభుత్వం త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.

ఇకనుంచైనా టీడీపీ నాయకులు దళితులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తోందని విమర్శించారు. గత జన్మభూమి సమయంలో ఇబ్రహీంపట్నం తహశీల్దార్ ఇంతియాజ్ పాషాను మంత్రి ఉమా ఒత్తిడికి గురిచేశారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న అక్రమాలపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలని జోగి రమేష్ డిమాండ్‌ చేశారు.

Related News